యంగ్ హీరో నితిన్ మరోసారి స్టోర్ ప్లేయర్ గా నటించబోతున్నాడు. ఈ హీరోతో ప్రయోగాత్మక దర్శకుడు బాక్సాఫీస్ చదరంగం ఆడించబోతున్నాడు. మైండ్ గేమ్ తో సాగే స్పోర్ట్స్ డ్రామాతో నితిన్ సర్ ప్రైజ్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. 


ఎన్ని ఫ్లాప్స్ వచ్చినా ఎక్కడా గ్యాప్ లేకుండా నితిన్ వరుసపెట్టి సినిమాలు చేస్తున్నాడు. త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన అఆ సినిమాతో కెరీర్ లో బిగ్గెస్ట్ అందుకున్న నితిన్ మూడేళ్లుగా హిట్ లేక సతమతమవుతున్నాడు. లాస్ట్ ఇయర్ నితిన్ నటించిన రెండు క్రేజీ సినిమాలు చల్ మోహన్ రంగా, శ్రీనివాస కళ్యాణం తీవ్రంగా నిరాశపరిచాయి. దీంతో ఈ యంగ్ హీరో మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. 


నితిన్ ప్రస్తుతం మూడు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. వెంకీ కుడుముల దర్శకత్వంలో భీష్మ సినిమాలో నటిస్తున్నాడు. రష్మిక మందన హీరోయినా నటిస్తున్న ఈ మూవీ షూటింగ్ ఫైనల్ స్టేజ్ కు చేరుకుంది. దీంతో పాటు వైవిధ్య చిత్రాల దర్శకుడిగా గుర్తింపు పొందిన చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రానికి చదరంగం అనే టైటిల్ ను ను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. 


చదరంగం టైటిల్ తో రూపొందనున్న ఈ సినిమాలో నితిన్ చెస్ ప్లేయర్ గా కనిపించబోతున్నట్టు టాక్. అందుకే ఈ టైటిల్ అయితే పర్ ఫెక్ట్ గా సరిపోతుందని దర్శకుడు భావిస్తున్నట్టు తెలుస్తోంది. టైటిల్ వింటే స్పోర్ట్స్ డ్రామాలా ఉన్న ఈ సినిమా క్రైమ్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో సాగుతోందని వినిపిస్తోంది. చంద్ర శేఖర్ యేలేటి సినిమాలంటేనే స్క్రీన్ ప్లే హైలెట్ ఉంటుందని అందరికీ తెలిసిందే. ఈ చదరంగం సినిమాకు కూడా స్ర్కీన్ ప్లే హైలెట్ గా సాగుతోందని వినికిడి. వచ్చే సినిమాలు యంగ్ హీరోకు కలిసి రావాలని మనమూ ఆశిద్దాం.. 

మరింత సమాచారం తెలుసుకోండి: