అక్టోబర్ 2వ తేదీన మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన సైరా నరసింహా రెడ్డి సినిమా విడుదలయింది. కర్నూలు జిల్లా ఉయ్యాలవాడ గ్రామానికి చెందిన ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత చరిత్రతో ఈ సినిమా తెరకెక్కింది. తెలుగులో ఈ సినిమాకు యావరేజ్ టాక్ వచ్చింది. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో విడుదలైన ఈ సినిమాకు తెలుగులో తప్ప మరెక్కడా నిర్మాత ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రావటం లేదు. 
 
సోమవారం రోజు ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో 5 కోట్ల రూపాయల షేర్ వసూలు చేసింది. ఆరు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో సైరా సినిమాకు 75 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి. 5 రోజుల్లో కర్ణాటకలో సైరా సినిమా 12 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లు వసూలు చేసింది. ఓవర్సీస్ లో ఈ సినిమాకు 9 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చినట్లు తెలుస్తోంది. తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో మాత్రం సైరా కలెక్షన్లు దారుణంగా ఉన్నాయి. 
 
5 రోజుల్లో సైరా సినిమాకు తమిళనాడులో కోటీ 20 లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు రాగా కేరళలో కేవలం 60 లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు మాత్రమే వచ్చినట్లు తెలుస్తోంది. ఈ రెండు రాష్ట్రాల్లో సైరా సినిమా భారీ డిజాస్టర్ అయింది. బాలీవుడ్ లో కూడా సైరా సినిమా డిజాస్టర్ ఫలితాన్ని అందుకుంది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన సైరా సినిమా తెలుగు రాష్ట్రాలు కాకుండా మిగిలిన రాష్టాల్లో అంచనాలు పెంచటంలో మాత్రం ఫెయిల్ అయింది. 
 
దాదాపు 285 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో రామ్ చరణ్ ఈ సినిమాను నిర్మించాడు. సైరా సినిమా తెలుగు రాష్ట్రాల్లో హిట్ అనిపించుకోవాలంటే మరో 45 కోట్ల రూపాయల షేర్ వసూలు చేయాల్సి ఉంది. రేపటితో దసరా సెలవులు పూర్తవుతున్నాయి కాబట్టి గురువారం నుండి సైరా సినిమా సాధించే కలెక్షన్లను బట్టి సినిమా ఫైనల్ స్టేటస్ అంచనా వేయవచ్చు. 
 
 



మరింత సమాచారం తెలుసుకోండి: