బిగ్ బాస్ సోమవారం ఎపిసోడ్ లో నామినేషన్ ప్రక్రియ కామనే.   మరో నాలుగు వారాలు మాత్రమే ఉన్న ఈ సీజన్లో ఆట ఎలా టర్న్ అవుతుందో ఎవరికీ తెలియదు.  అందుకే నామినేషన్స్ చాలా కీలకంగా మారాయి. 

 

ఈవారం నామినేషన్స్ కోసం బిగ్ బాస్ ట్రాలీ పార్కింగ్ టాస్క్ ఇచ్చాడు. 8 మంది సభ్యులకు 8 ట్రాలీ లు ఇచ్చి వాటిని పార్క్ చేయమని చెప్పాడు.  ఇలా నాలుగు రౌండ్స్  జరుపగా మొదటి రౌండ్ లో వరుణ్ రెండో రౌండ్ లో వితిక నామినేట్ అయ్యింది.  

 

మూడవ రౌండ్ లో మహేష్,  ఆ తర్వాత రాహుల్ నామినేట్ అయ్యారు. శ్రీముఖి,  శివ జ్యోతి,  బాబా భాస్కర్,  అలీ రెజా నామినేట్ అవకుండా జాగ్రత్తపడ్డారు. వరుణ్ వరుసగా 3 వ వారం కూడా నామినేట్ అవడం విశేషం. టైటిల్ విన్నర్ అంటూ చెప్పుకుంటున్న వరుణ్ వరుసగా నామినేట్ అవడం షాక్ గానే ఉంది.

 

మరో మూడు వారాలు మాత్రమే ఎలిమినేషన్స్ ఉంటాయి. ఇప్పటి వరకు టైటిల్ విన్నర్ గా నిలిచే ఛాన్స్ ఎవరన్నది ఇంకా డిసైడ్ కాలేదు. దసరా సందర్బంగా హోస్ట్ నాగార్జున బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి ఇంటి సభ్యులను సర్ ప్రైజ్ చేశారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: