దేవిశ్రీ ప్రసాద్ దాదాపు 20 సంవత్సరాల క్రితం టాలీవుడ్ ఇండస్ట్రీలో సంగీత దర్శకునిగా కెరీర్ మొదలుపెట్టాడు. స్టార్ హీరోల సినిమాలకు వరుసగా అవకాశాలు రావటం, ఆ సినిమాలన్నీ మ్యూజికల్ హిట్స్ కావటంతో  దేవిశ్రీకి టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి పేరొచ్చింది.   దేవిశ్రీ ప్రసాద్ ముందు తరువాత టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా మంది మ్యూజిక్ డైరెక్టర్స్ అవకాశాలు లేక ఇండస్ట్రీకి దూరమైనా  దేవిశ్రీ ప్రసాద్ కు మాత్రం అవకాశాలు తగ్గలేదు. 
 
టాలీవుడ్ లోని కొందరు దర్శకులు ఏ హీరోతో సినిమా తీసినా మ్యూజిక్ డైరెక్టర్ గా  దేవిశ్రీ ప్రసాద్ కే అవకాశం ఇచ్చేవారు. టాలీవుడ్ లో హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకొనే మ్యూజిక్ డైరెక్టర్ కూడా  దేవిశ్రీ ప్రసాద్ కావటం విశేషం. కానీ గత రెండు మూడు సంవత్సరాల నుండి  దేవిశ్రీ ప్రసాద్ కు అవకాశాలు తగ్గుతున్నాయి. 2018 సంవత్సరం నుండి టాలీవుడ్ ఇండస్ట్రీలో  దేవిశ్రీ ప్రసాద్ హవా తగ్గుతూ వస్తుంది. 
 
2018 సంవత్సరంలో దేవిశ్రీ కేవలం రంగస్థలం, భరత్ అనే నేను, హలో గురు ప్రేమకోసమే సినిమాలకు మాత్రమే సంగీతం అందించాడు. ఈ సంవత్సరం వినయ విధేయ రామ, ఎఫ్ 2, చిత్రలహరి, మహర్షి సినిమాలకు సంగీతం ఇచ్చాడు. ఒకప్పుడు  దేవిశ్రీ ప్రసాద్ సినిమాల్లో అన్ని పాటలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. కానీ ప్రస్తుతం మాత్రం ఒకటీ రెండు పాటలు హిట్ అవుతున్నా పూర్తి స్థాయిలో సంగీత ప్రియుల్ని  దేవిశ్రీ ప్రసాద్ పాటలు ఆకట్టుకోవటం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. 
 
ప్రస్తుతం  దేవిశ్రీ ప్రసాద్ సరిలేరు నీకెవ్వరు, ఉప్పెన సినిమాలకు సంగీతం అందిస్తున్నాడు. అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్లో సినిమాకు కూడా  దేవిశ్రీనే సంగీతం అందించే అవకాశాలు ఉన్నాయి. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహించిన సినిమాలకు ఇప్పటివరకు  దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. కానీ ఈరోజు జరిగిన మెగాస్టార్ 152వ చిత్రం లాంఛనం పూజా కార్యక్రమం వివరాలలో దేవిశ్రీ ప్రసాద్ పేరు లేదు. మరి కొరటాల శివ ఈ సినిమాకు  దేవిశ్రీ ప్రసాద్ నే మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకుంటాడో లేక మరో సంగీత దర్శకుడిని తీసుకుంటాడో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: