చిరంజీవి చాలా రోజుల తర్వాత చరిత్రకు కూడా అసూయ పుట్టే సినిమాని తీసి చరిత్ర పుటముల తుప్పు విదిల్చిన సంగతి తెలిసిందే అయితే అసలు ట్విస్ట్ ఇప్పుడే మొదలైంది.

సైరా నరసింహారెడ్డి ఘన విజయం నేపథ్యంలో నిన్న సైరా చిత్ర యూనిట్ మీడియా ఇంటరాక్షన్ కార్యక్రమంలో పాల్గొన్నారు మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు సురేందర్ రెడ్డి తోపాటు నటుడు రవి కిషన్, సాయి చంద్, రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి తో మరికొందరు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పత్రికా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు యూనిట్ సభ్యులు సమాధానాలు చెప్పడం జరిగింది. ఒకరు చిరుని మంచి సోషల్ అండ్ పొలిటికల్ కాన్సెప్ట్ ఉన్న కథతో వస్తే పవన్ కళ్యాణ్ గారితో కలిసి మూవీ చేస్తారా? అని అడుగగా చిరు ఆసక్తికర సమాధానం ఇచ్చారు.

మంచి స్క్రిప్ట్ తో దర్శకులు వస్తే తమ్ముడు పవన్ కళ్యాణ్ తో సినిమా చేయడానికి ఎప్పుడూ సిద్దమే అలాంటి కథను ఇచ్చే వారుంటే అంతకన్నా ఏం కావాలంటూ జవాబు కూడా ఇచ్చారట.ఆయన కుండ బద్దలు కొట్టినట్టు చెప్పిన సమాధానంకి మీడియా మిత్రులందరిని ఆశ్చర్యానికి లోను చేశారు. పవన్ కళ్యాణ్ పూర్తిగా రాజకీయలకే అంకితం అని చెబుతున్న నేపథ్యంలో చిరు వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఐతే సమకాలీన రాజకీయ పరిస్థితులు, సోషల్ మెసేజ్ కలిగిన సినిమాలు పవన్ పొలిటికల్ కెరీర్ కి కూడా ఉపయోగపడే అవకాశం ఎంతో  ఉండటంతో ఆయన మళ్ళీ ముఖానికి మేకప్ వేసుకున్నా ఆశ్చర్యం పడాల్సిందేంలేదు. ఏది ఏమైనా చిరు స్టేట్మెంట్ పవన్ ని మరో మారు తెరపై చూడాలనుకుంటున్న అభిమానుల ఆశకు ఊపిరి పోసింది అని చెప్పవచ్చు.మరి ఇంతకి పవన్ కళ్యాణ్ ఏమంటారో అని అభిమాన లోకం అంతా వేచి చూస్తుంది. మరో పక్క రచయితలు,డైరెక్టర్స్ కూడా కథను తయారు చేయడంలో అంతే తలమునకలయ్యారు.ఈ కాంబినేషన్ కుదిరితే బాక్స్ ఆఫీసులకు సిరుల పంట పండినట్టే అంటున్నారు సినీ విమర్శకులు...

 

మరింత సమాచారం తెలుసుకోండి: