ఈ రోజునే రిలీజ్ అయిన 'జార్జి రెడ్డి' ట్రైలర్ ఇప్పుడు తెలుగు సినీ ప్రజల చూపుని తన వైపు తిప్పుకుంది. ఖచ్చితంగా చెప్పాలంటే ఒక సంచలనం గా మారింది. నిజానికి జార్జి రెడ్డి అనే అతనిని హైదరాబాదులోని యువత భాగ్యనగరానికి చెగువేరా అని పిలుస్తుంటారు. అతని ఆశయాలు, సిద్ధాంతాలు మరియు దూకుడు చూసి అప్పట్లో లో మహా నగరం మొత్తం నివ్వెరపోయింది. విద్యార్థుల హక్కుల కోసం మరియు రాజకీయాలలో ఉన్న గోడలు బద్ధలు కొట్టేందుకు అతను చేసిన పోరాటం అసమానం. 

ఇప్పుడు అతని జీవిత చరిత్ర ఆధారంగానే 'దళం' సినిమా దర్శకుడు జీవన్ రెడ్డి, 'జార్జి రెడ్డి' అనే సినిమాని సందీప్ మాధవ్ హీరోగా తెరకెక్కిస్తున్నాడు. ఈరోజు రిలీజ్ అయిన చిత్రం ట్రైలర్ ఆంధ్రప్రదేశ్ యువతకు పూనకాలు తెప్పిస్తుండడం విశేషం. ఇక జార్జి రెడ్డి విషయానికి వస్తే అతను చదువుకున్న విశ్వవిద్యాలయంలో ఎమ్మెస్సీ ఫిజిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించాడు మరియు అతను ఒక మంచి బాక్సర్ కూడా. ఉన్నత కులానికి చెందిన వాడైనా కులాల పరంగా తక్కువ కులం వారిని తక్కువగా చూడడం తప్పు అని సమానత్వం కోసం పోరాడిన వ్యక్తి. 

ఇతని ఆదర్శం తోనే ఇప్పుడు చాలా స్టూడెంట్ యూనియన్ లు హైదరాబాద్ లో నడుస్తున్నాయి. కేవలం 25 ఏళ్ల యుక్తవయసులో హత్యకు గురైన జార్జిరెడ్డి కథను చాలా వ్యవస్థలు మరియు రాజకీయ వ్యవస్థ ఎవరైతే అతని చంపేశారో వారిని రక్షించి అందరూ మర్చిపోయేలా చేసింది. కానీ ఎన్నో హావ భావాలు మరియు ఎమోషన్స్ కలగలిసిన ఈ చిత్రాన్ని ఇప్పుడు జీవన్ రెడ్డి మనకి అందించిన పోతున్నాడు. ఈ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ చాలా మంచి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను ఇచ్చారు. జార్జిరెడ్డి పాత్ర మనలో చాలామందికి పెద్దగా పరిచయం లేకపోయినా ఈ ట్రైలర్ చూసిన తర్వాత జనాలు థియేటర్లకు గుంపులు గుంపులుగా వస్తారు అందులో ఎలాంటి సందేహం లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: