డిఫ‌రెంట్ చిత్రాల‌తో ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తున్న యువ క‌థానాయ‌కుల్లో శ్రీవిష్ణు ఒక‌రు. ఈ ఏడాది `బ్రోచేవారెవ‌రురా`తో సూప‌ర్‌హిట్ సాధించారు. వైవిధ్య‌మైన క‌థ‌, క‌థాంశాల‌కు ప్రాధాన్య‌త ఇచ్చే శ్రీవిష్ణు న‌టించ‌బోయే కొత్త చిత్రాన్ని విజ‌య‌ద‌శ‌మి రోజున ప్ర‌క‌టించారు. ఈ చిత్రానికి ప్ర‌దీప్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. డిఫ‌రెంట్ పోలీస్ క‌థాంశంతో తెర‌కెక్క‌నున్న ఈ చిత్రంలో శ్రీవిష్ణు పోలీస్ క్యారెక్ట‌ర్ చేస్తున్నారు. న‌వంబ‌ర్‌లో సినిమా షూటింగ్‌ ప్రారంభం కానుంది.  శేఖ‌ర్ వి.జోసెఫ్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్న ఈ చిత్రానికి మెలోడి బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ సంగీతాన్ని అందిస్తున్నారు. ల‌క్ష్య ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై ఎం.ఎల్‌.వి.స‌త్య‌నారాయ‌ణ‌(స‌త్తిబాబు) ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నారు. త్వ‌ర‌లోనే మిగ‌తా న‌టీన‌టులు, టెక్నీషియ‌న్స్ వివ‌రాల‌ను తెలియ‌జేస్తామ‌ని చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది.


టి.జి.విశ్వప్రసాద్‌, అభిషేక్‌ అగర్వాల్‌ నిర్మాతలు. శ్రీవిష్ణు, హాసిత్‌ గోలి వంటి ప్రతిభ కలిగిన వారితో ఈ చిత్రాన్ని నిర్మించటం ఎంతో ఆనందంగా ఉందని, ఒక వినూత్నమైన కథతో రూపొందనున్న ఈ చిత్రం షూటింగ్‌ ఈ ఏడాది చివరిలో ప్రారంభమవుతుందని నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి సహ నిర్మాతలు వివేక్‌ కూచి భొట్ల, కీర్తి చౌదరి.


శ్రీవిష్ణు,హాసిత్ గోలి వంటి ప్రతిభ కలిగినవారితో ఈ చిత్రాన్ని నిర్మించటం ఎంతో ఆనందంగా ఉంది. ఒక వినూత్నమైన కథతో రూపొందనున్న ఈ చిత్రం షూటింగ్  ఈ ఏడాది చివరిలో ప్రారంభమవుతుంది. చిత్రంలోని ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు కొద్ది రోజులలోనే ప్రకటిస్తామని ఈ చిత్ర నిర్మాతలు టి.జి.విశ్వప్రసాద్,అభిషేక్ అగర్వాల్ తెలిపారు. ఈ చిత్రానికి  సహ నిర్మాతలు వివేక్ కూచి భొట్ల, కీర్తి చౌదరి. ఇప్ప‌టివ‌ర‌కు శ్రీ‌విష్ణు అన్నీ ఫ్యామిలీ పాత్ర‌లు చేశారు.  అన్నీ కామ్‌గా చాలా డీసెంట్ పాత్ర‌ల‌ను చేశారు.

ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం:  ప్ర‌దీప్ వ‌ర్మ‌, నిర్మాత‌: ఎం.ఎల్‌.వి.స‌త్య‌నారాయ‌ణ‌(స‌త్తిబాబు) బ్యాన‌ర్‌: ల‌క్ష్య ప్రొడ‌క్ష‌న్స్‌,మ్యూజిక్‌: మ‌ణిశ‌ర్మ‌, సినిమాటోగ్ర‌ఫీ:  శేఖ‌ర్ వి.జోసెఫ్‌, ఆర్ట్‌:  వివేక్‌


మరింత సమాచారం తెలుసుకోండి: