సాధారణంగా టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి దసరా పండగ సీజన్ ఎంతో కీలకం. ఈ పండగను నమ్ముకునే తమ సినిమాల్ని రిలీజ్ చేసి లాభాలు పొందాలని ప్రతి దర్శక, నిర్మాత అనుకొని ముందు నుంచే ప్లాన్ చేస్తుంటారు. అలా గతంలో దసరా పండగ బరిలో దిగి కంటెంట్ వున్నసినిమాలు భారీ వసూళ్లని సాధించిన రికార్డులు తెలుగు సినీ చరిత్రలో లెక్కకు మించి ఉన్నాయాన్న సంగతి తెలిసిందే. పండగలు అంటే సినిమా థియేటర్లన్నీ జనాల సందడితో కళకళలాడిపోయేవి. ఇంటికి వచ్చిన బంధుమిత్రులతో జనమంతా థియేటర్ల ముందు వాలిపోయోవారు.  థియేటర్లన్నీ మార్నింగ్ షో నుండే కిక్కిరిసిన జనంతో నిండిపోయేవి. 

భారీ అరుపులు కేకలలో దద్దరిల్లిపోయోవి.  కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అందుకు పెద్ద ఉదాహరణగా సైరా నే కనిపిస్తోంది. థియేటర్ల దగ్గర పండగ జోష్ ఏమాత్రం కనిపించకుండా ఈగలు తరుముకుంటున్నట్టుంది పరిస్థితి.  థియేటర్లలో బ్లాక్ బస్టర్ సినిమా ఆడుతుంటే జనాలు మాత్రం ఇంట్లో కూర్చుని అమెజాన్ ప్రైమ్.. నెట్ ఫ్లిక్స్.. జీ 5 లాంటి ఆన్ లైన్ స్ట్రీమింగ్ సైట్లను చూస్తు ఎంజాయ్ చేస్తున్నారు. ఇక యూత్ అయితే కంప్లీట్ గా స్మార్ట్ ఫోన్ - ల్యాప్ టాప్ లలో సినిమాలు చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. 

ఎంతో కష్టపడి వంద కోట్లు పెట్టి సినిమాలు తీసినా జనాలు మాత్రం టీవీలకు అతుక్కుపోవడం చూసి ఫిల్మ్ మేకర్స్ షాక్ కి గురౌతున్నారు. ఎన్ని కోట్లు పెట్టి పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు తీసినా జనం మాత్రం అమెజాన్ ప్రైమ్ వంటి వాటికి అట్రాక్ట్ అయిపోవడం సినీ ప్రపంచాన్ని వణికిస్తోంది. రాబోయో రోజుల్లో వెబ్ సిరీస్ ల హంగామా మొదలైతే తెలుగు సినిమా పరిస్థితి ఎలా ఉంటుందోనని చాలామంది భయపెడుతున్నారు. అందుకే కొంతమంది ఇప్పటి నుంచే స్టార్స్ తో వెబ్ సిరీస్ నిర్మించాలనే ప్లాన్స్ వేసుకుంటున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: