బ్లాక్ బస్టర్ హిట్స్ తో మెగా దర్శకుడిగా వి.వి.వినాయక్ అందరికి తెలిసిన వ్యక్తి. కానీ ఆయనలో ఇలాంటి ఓ కొత్త కోణం ఉందని ఎప్పుడు ఎవరు ఊహించరు. వినాయక్ ను ఒక స్టార్ డైరెక్టర్ గా మాత్రమే అభిమానించిన అభిమానులు ఇప్పటి నుంచి ఆయనని ఒక హీరోగా కూడా అభిమానించబోతున్నారని ఫిల్మ్ నగర్ లో చాలామంది చెప్పుకుంటున్నారు. దిల్ సినిమాతో డైరెక్టర్ గా పరిచయమైన వినాయక్ యంగ్ టైగర్ ఎన్.ట్.ఆర్ ను మాస్ హీరోగా స్క్రీన్ మీద ప్రజెంట్ చేసిన విధానంతో తన స్టామినా ఏంటో ఇండస్ట్రీ మొత్తం తెలిసిపోయింది. ఈ ఒక్క సినిమాతో వినాయక్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా సెటిల్ అయ్యాడు. ఆ తర్వాత నందమూరి బాలకృష్ణ తో చెన్నకేశవ రెడ్డి, మెగాస్టార్ తో ఠాగూర్ సినిమాలు ఇండస్ట్రీ హిట్స్ గా నిలిచిపోయాయి. 

ఇక ఈ ఒక్క పోస్టర్ చాలు. వినాయక్ లో హీరో అవ్వాలన్న తపన గురించి చెప్పేందుకు. అంతగా హీరో అప్పియరెన్స్ ఇప్పటికిప్పుడే ఎలా సాధ్యం..? అనుకునేంతగా సర్ ప్రైజ్ ని ఇచ్చారు. తను హీరో అవుతున్నాను! అని తలచినదే తడవుగా శరీరాకృతిని మార్చుకుని మేకోవర్ చూపించిన తీరు.. ఆ హార్డ్ వర్క్ చూస్తుంటే ఆయనకు అన్నయ్య మెగాస్టార్ ఇన్స్పిరేషన్ అని వేరే చెప్పాల్సిన అవసరం లేదు. మెగాస్టార్ స్ఫూర్తి ఆయనను అభిమానించే ప్రతి ఒక్కరిలో కనిపిస్తుందనడానికి ఇంతకంటే ఎగ్జాంపుల్ ఇంకేం కావాలి... అంటు కూడా పాజిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. తాజాగా రిలీజ్ చేసిన లుక్ లో మూడు రకాల షేడ్స్ వినాయక్ లో కనిపిస్తున్నాయి. ఒకటి మెగాస్టార్ లా రెండోది గ్యారేజ్ నుంచి వస్తుంటే జనతా గ్యారేజ్ ఓనర్ మోహన్ లాల్ లాగా. ఆ మెడలో ఎర్ర కండువా చూస్తుంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లా అనిపిస్తున్నాడంటు కంపేరిజన్స్ స్టార్ట్ అయ్యాయి. 

దిల్ సినిమాతో నిర్మాతగా తనకు లైఫ్ నిచ్చిన వినాయక్ ని హీరోగా పరిచయం చేసే బాధ్యతను దిల్ రాజు తీసుకున్నారు. దసరా సందర్భంగా వినాయక్ సీనయ్య లుక్ ని రిలీజ్ చేశారు. టైటిల్ క్యాచీగా ఉంది. ఈ లుక్ కి అద్భుత స్పందన వస్తోంది. అక్టోబర్ 9 వినాయక్ బర్త్ డే సందర్భంగానూ ఈ లుక్ ని రిలీజ్ చేశారు చిత్రబృందం. దర్శకుడు శంకర్ అసోసియేట్ నరసింహారావు ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. వినాయక్ హీరోగా ఎంతవరకు మెప్పిస్తారు అన్నది చూడాలి.  



మరింత సమాచారం తెలుసుకోండి: