టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ దాసరి మారుతి 'ప్రతి రోజూ పండగే' అంటూ మెగా ఫ్యామిలీ హీరో సాయి ధరమ్ తేజ్ తో ఒక సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా విశేషాలను మీడియాకు తెలిపారు. నేను తీసిన సినిమాలన్నీ ఒకదానికి ఒకటి భిన్నంగా వుండేలా చూసుకుంటూ వస్తున్నానని, కేవలం డైరక్టర్ కావలనే ఉద్దేశ్యంతోనే ఈ రోజుల్లో, బస్ స్టాప్ వంటి యూత్ సినిమాలు తీశానని, డైరక్టర్ గా నిలదొక్కుకోవడం కోసం మాత్రం భలే భలే మగాడివోయ్, మహానుభావుడు సినిమాలు తీశానని ఒక సీక్రెట్ ని బయట పెట్టాడు.

ఇక నేను చేసిన ప్రేమకథాచిత్రమ్ హిట్ అయిన తరువాత అదే జోనర్ ను మళ్ళీ టచ్ చేయలేదు. కానీ ఆ జోనర్ ఇఫ్పటికీ టాలీవుడ్ లో ఒక సక్సెస్ ఫుల్ ఫార్ములాగా మారి చాలా మంది అదే జోనర్ లో సినిమాలను తీసి కమర్షియల్ గా సక్సస్ అవుతున్నారని మారుతి అన్నారు. ఇప్పుడు బతుకే కాదు, మనిషికి ఎప్పటికైనా తప్పని చావు కూడా పండగలాంటిదే అన్న చిన్న ఆలోచనతో ప్రతి రోజూ పండగే సినిమా తెరకెక్కిస్తున్నానని వెల్లడించారు. మనిషి పుట్టినప్పుడు సంతోషంగా సెలెబ్రెట్ చేసుకుంటారు. కానీ మనిషి చావు బతుకుల్లో ఉన్నప్పుడు అతన్ని మానసికంగా సంతోష పెడితే ఇంకా ఎక్కువ రోజులు బ్రతుకుతాడానే విషయాన్ని కాస్త వినోదం జోడించి చెప్తున్నాను. ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యే చాలా అంశాలు ఈ సినిమాలో ఉండబోతున్నాయని సినిమా విశేషాలను తెలిపాడు.

ప్రతిరోజు పండగే సినిమాను రాజమండ్రి లో కొంత టాకీ పార్ట్ ను షూట్ చేశాం. ప్రకృతికి దగ్గరగా ఉన్న ఈ కథ కోసం పచ్చని పొలాల్లో కథలో కీలకమైన సన్నివేషాలు చిత్రీకరించాం. ఈ సినిమాలో ఐదు పాటలు ఉన్నాయి. థమన్ సంగీతం, సత్యరాజ్ నటన సినిమాకు అదనవు ఆకర్షణ అని మారుతి వివరించారు. ఇక ఈ సినిమా 80% షూటింగ్ కంప్లీటయిందని కొంత టాకీ పార్ట్ సహా సాంగ్స్ బ్యాలెన్స్ ఉన్నాయని నెక్స్ట్ షెడ్యూల్ లో మిగతా పార్ట్ కంప్లీటవుతుందని చెప్పారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: