మెగాస్టార్ చిరంజీవి తాజా సినిమా సైరా నరసింహారెడ్డి ఇటీవల ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. స్వాతంత్రోద్యమ బ్యాక్ డ్రాప్ లో అత్యంత భారీ ఖర్చుతో పాన్ ఇండియా ఫీల్ తో తెరకెక్కిన ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ, కన్నడ, మలయాళం, తమిళ్ వంటి ఇతర భాషల్లో కూడా రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా ఫైనల్ గా యావరేజ్ టాక్ ని దక్కించుకుని ప్రస్తుతం పర్వాలేదనిపించేలా కలెక్షన్స్ సాధిస్తూ ముందుకు సాగుతోంది. 

వాస్తవానికి తొలి రోజు ఓపెనింగ్స్ అదరగొట్టిన సైరా సినిమా, రెండవ రోజు నుండి కొంత మెల్లగా నత్తనడకన ముందుకు సాగింది. ఇక మొన్న నాలుగు రోజుల నుండి నేటి వరకు దసరా సెలవలు కావడంతో ఈ సినిమాకు ఒకింత బెటర్ గానే కలెక్షన్స్ వచ్చినట్లు చెప్తున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఇక వారు చెప్తున్న లెక్కల ప్రకారం, ఇప్పటివరకు తెలుగు వర్షన్ లో ఈ సినిమా రూ.74 కోట్ల వరకు షేర్ ని రాబట్టడం జరిగిందట. ఇక మిగిలిన ఇతర భాషలన్నిటిలో కలిపి రూ.26 కోట్ల వరకు షేర్ వచ్చిందని, 

ఈ విధంగా మొత్తం కలిపి రూ.103 కోట్ల వరకు షేర్ ని రాబట్టిన ఈ సినిమా, దసరా పండుగ సెలవులను బాగానే సద్వినియోగం చేసుకుందనే చెప్పాలి. అయితే హిందీ వర్షన్ లో మాత్రం వార్ మరియు హాలీవుడ్ మూవీ జోకర్, సైరా కలెక్షన్స్ పై భారీ ప్రభావం చూపించాయి. ఆ రెండు చిత్రాల నుండి భారీ పోటీని ఎదుర్కొన్న సైరా, అక్కడ చాలా ఏరియాలలో కలెక్షన్స్ కోల్పోయింది. అయితే రేపటి నుండి వర్కింగ్ డేస్ కావడంతో సైరాకు అసలు పరీక్ష మొదలుకానుంది. మరి ఇకనుండి ఈ సినిమా ఎంత మేర రాబడుతుందో చూడాలి....!!


మరింత సమాచారం తెలుసుకోండి: