మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, ముకుంద అనే సినిమాతో టాలీవుడ్ కి హీరోగా ఎంట్రీ ఇవ్వడం జరిగింది. అయితే తొలి సినిమా పెద్దగా సక్సెస్ కానప్పటికీ వరుణ్ తేజ్, నటుడిగా ప్రేక్షకుల హృదయాలు గెలుచుకున్నారు. ఇక ఆ తరువాత క్రిష్ డైరెక్షన్ లో నటించిన కంచె సినిమా, వరుణ్ లోని పూర్తి స్థాయి నటుడిని ప్రేక్షకులకు పరిచయం చేసింది. ఆ తరువాత ఫిదా, తొలిప్రేమ వంటి మంచి రొమాంటిక్ లవ్ సినిమాల్లో నటించిన వరుణ్, ఇటీవల హరీష్ శంకర్ దర్శకత్వంలో కెరీర్ లో తొలిసారి గద్దలకొండ గణేష్ అనే మాస్ క్యారెక్టర్ లో నటించి మంచి హిట్ సాదించాడు. 

కొద్దిరోజుల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా, ఇప్పటికీ మంచి కలెక్షన్స్ సాధిస్తూ ముందుకు సాగుతోంది. ఇకపొతే వరుణ్ తేజ్ అతి త్వరలో తన కొత్త చిత్రంలో నటించనున్నారు. కిరణ్ కొర్రపాటి అనే నూతన దర్శకుడి దర్శకత్వంలో నటించనున్న వరుణ్, ఈ సినిమాతో మరొక ప్రయోగాన్ని చేయనున్నారు. గతంలో కంచె, అంతరీక్షం వంటి ప్రయోగాత్మక సినిమాల్లో నటించిన వరుణ్, ఈ సినిమాతో తొలి సారి ఒక స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ సినిమాలో నటించనున్నారు. ఇందులో వరుణ్ ఒక బాక్సింగ్ క్రీడాకారుడిగా నటించబోతున్నాడు. 

మరొక రెండు రోజుల్లో ఈ సినిమా అధికారికంగా ప్రారంభం కానుందని, అలానే దీనిని అల్లు అర్జున్ సోదరుడు అల్లు బాబీ నిర్మించనున్నారని ఫిలిం నగర్ వర్గాల సమాచారం. ఇక ఈ సినిమాలో మంచి కథ, కథనాలతో పాటు నేటి యువతకు మెసేజ్ కూడా ఉంటుందని అంటున్నారు. అలానే అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా దర్శకుడు ఈ స్క్రిప్ట్ ని రెడీ చేసాడట. మరి ఇప్పటికే గద్దలకొండ గణేష్ సినిమా హిట్ తో మంచి ఫామ్ లో ఉన్న వరుణ్, ఈ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ సినిమాతో ఎంత మేర విజయాన్ని అందుకుంటారో చూడాలి.....!!


మరింత సమాచారం తెలుసుకోండి: