ప్రస్తుతం సినిమా పరిశ్రమతో పాటు బుల్లి తెర పరిశ్రమ కూడా మంచి రేటింగ్స్ తో ముందుకు సాగుతోంది. ఆ విధంగా టెలివిజన్ ఛానల్స్ వారు కూడా ఎప్పటికప్పుడు సరికొత్త వెరైటీ ప్రోగ్రామ్స్ తో వీక్షకులను ఆకట్టుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇక అందుకు తగ్గట్లే ఆయా ప్రోగ్రామ్స్ కోసం యాంకర్లు గా మంచి అందం మరియు వాక్చాతుర్యం గల వారిని తీసుకుంటున్నారు. ఇక ప్రస్తుతం బుల్లితెరపై మంచి పేరుతో ముందుకు సాగుతున్న లేడీ యాంకర్స్ లో సుమ ముందు వరుసలో ఉండగా, ఆ తరువాత ఝాన్సీ, అనసూయ, 

రష్మీ, శ్రీముఖి వంటి వారు ఉన్నారు. అయితే ఇటీవల కొన్నేళ్ల క్రితం టెలివిజన్ పరిశ్రమకు యాంకర్ గా ప్రవేశించి తన నటన మరియు అందంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న యంగ్ యాంకర్ మంజూష, ఇటీవల కాలంలో విరివిగా టివి ప్రోగ్రామ్స్ మరియు పలు సినిమాల ఆడియో మరియు ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ లో సందడి చేస్తోంది. అంతేకాదు వాటి ద్వారా ఆమె నెల నెలా లక్షల్లో ఆదాయాన్ని కూడా సంపాదిస్తున్నట్లు సమాచారం. ఇక ప్రస్తుతం మంచి పేరుతో దూసుకుపోతున్న ఈ లేడీ యాంకరమ్మ, నేడు దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని ఒక సరికొత్త కాస్ట్ లి బెంజ్ కారును కొనుగోలు చేసి, 

దానితో ఫోటో దిగి తన సోషల్ మీడియా మాధ్యమాల్లో అప్ లోడ్ చేయడం జరిగింది. ఎవ్వర్ లేటెస్ట్ బెంజ్ సెడాన్ రేంజ్ కార్ తో ఆమె ఫోజులిచ్చిన ఆ ఫోటో ప్రస్తుతం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతుండగా, పలువురు ఆమెకు శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు. అయితే అందుతున్న సమాచారం ప్రకారం మంజూషకు ఇటీవల కొన్ని సినిమా ఆఫర్లు కూడా వస్తున్నాయి అని, అయితే ఆమె ఆ విషయమై ఇప్పటి వరకు ఇంకా ఎటువంటి సినిమా ఒప్పుకోలేదని అంటున్నారు. ఎంతైనా కాలం కలిసి వచ్చినపుడు అన్ని మనల్ని వెతుక్కుంటూ అవే మనదగ్గరకే వస్తాయి కదా మరి.....!! 


మరింత సమాచారం తెలుసుకోండి: