‘సైరా’ 100 కోట్ల నెట్ కలక్షన్స్ ను అందుకుని ఈ తెలుగు రాష్ట్రాలలో సుమారు 70 కోట్లకు పైగా నెట్ కలక్షన్స్ ను రాబట్టుకుని ఈ మూవీ నేటితో రెండవ వారంలోకి ప్రవేశిస్తోంది. దసరా పండుగ అయిపోయిన నేపధ్యంలో ఈరోజు ‘సైరా’ కు కలక్షన్స్ విషయంలో తీవ్ర పరీక్ష ఎదురు కాబోతోంది.

ఇలాంటి పరిస్థితులలో అత్యంత కీలకమైన ఈ రెండవ వారం కలక్షన్స్ ను నిలబెట్టాలని చరణ్ సూచనతో త్రివిక్రమ్ ‘సైరా’ ను ప్రమోట్ చేయడానికి రంగంలోకి దిగాడు. ఈ మూవీ గురించి తన అభిప్రాయాలను చిరంజీవి చరణ్ ల ధైర్యం గురించి అనేక ఆసక్తికర విషయాలు త్రివిక్రమ్ చరణ్ చిరంజీవిలతో షేర్ చేసుకున్న ఒక ఇంటర్వ్యూ వీడియోను విడుదల చేసారు. 

ఈ ఇంటర్వ్యూలో చిరంజీవి మాట్లాడుతూ ‘సైరా’ రికార్డులకు రామ్ చరణ్ సహకరించడం లేదు అన్న షాకింగ్ ట్విస్ట్ ఇచ్చాడు. ‘సైరా’ కలక్షన్స్ ను తెలియ చేస్తూ పోస్టర్లు విడుదల చేయడం మీడియా మీట్స్ లో అధికారికంగా ప్రకటించడం చరణ్ కు నచ్చదు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసాడు. 

అంతేకాదు ఇలా కలక్షన్స్ గురించి ప్రచారం చేయడం వల్ల ఇండస్ట్రీకి తప్పుడు సంకేతాలు వెళ్ళి హీరోల మధ్య అనవసరపు పోటీ ఏర్పడి విద్వేషాలకు ఇగో లకు తావు ఇస్తుందని అందువల్ల ‘సైరా’ రికార్డుల గురించి ప్రకటన చేయడం చరణ్ ఇష్టం లేదు అంటూ చిరంజీవి షాకింగ్ ట్విస్ట్ ఇచ్చాడు. ఈ మాటలు చిరంజీవి నోటివెంట నిన్న త్రివిక్రమ్ చరణ్ మాటలకు సపోర్ట్ చేస్తూ ఇలాంటి మంచి ఆలోచనలు చరణ్ కు రావడం అభినందనీయం అంటూ ‘సైరా’ రికార్డుల కోసం కాకుండా ఒక మంచి సినిమా తీయాలి అన్న చరణ్ తపనకు సంకేతం అంటూ చరణ్ ను విపరీతంగా ప్రశంసించాడు. అయితే రికార్డులను చరణ్ ప్రకటించక పోయినా ‘సైరా’ ను భారీ రేట్లకుకు కొనుక్కున్న బయ్యర్లు ‘సైరా’ మధనపడతారు అన్నది వాస్తవం..


మరింత సమాచారం తెలుసుకోండి: