బిగ్ బాస్ సీజన్ 3 హోస్ట్ గా చేస్తున్న కింగ్ నాగార్జున దసరా పండుగ సందర్బంగా ఇంటి సభ్యులకు షాక్ ఇచ్చారు. సర్ ప్రైజ్ గా హౌజ్ లోకి నాగార్జున ఎంట్రీ అదిరింది. సోగ్గాడు లుక్ లో నాగ్ ఎంటర్ అయ్యాడు. 

 

అంతకుముందు బిగ్ బాస్ ఇంటి సభ్యులకు వంటల టాస్క్ ఇచ్చాడు.  ఇంట్లో ఉన్న 8 మంది రెండు టీమ్ లుగా విడిపోయి వంటలు వండారు. ఆ తర్వాత నాగార్జున హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు.  ఇంట్లో వాళ్ళకోసం స్వీట్స్,  గిఫ్టులు తెచ్చాడు నాగ్. అంతేకాదు ఆటపాటలతో ఎపిసోడ్ సాగింది. 

 

ఇంటి సభ్యుల్లో వాళ్లకు తెలియని మైనస్ లను కూడా చెప్పారు నాగార్జున. బిగ్ బాస్ మొదటి సీజన్లో ఎన్టీఆర్ ఒకసారి హౌస్ లోకి వచ్చారు. సెకండ్ సీజన్లో హోస్ట్ నాని కూడా పండుగ రోజు హౌస్ లోకి వచ్చి సర్ ప్రైజ్ చేశాడు. ఇప్పుడు నాగార్జున కూడా దాసరా పండుగ సందర్బంగా హౌస్ లోకి వెళ్లి ఇంటి సభ్యులకు కానుకలు ఇచ్చాడు. 

 

హోస్ట్ గా నాగార్జున సక్సెస్ అయినట్టే. ఆల్రెడీ మీలో ఎవరు కోటీశ్వరుడు షోతో అదరగొట్టిన నాగ్ ఈసారి బిగ్ బాస్ హోస్ట్ గా కూడా తన సత్తా చాటాడు. ఈమధ్య సినిమాల సక్సెస్ లకు కాస్త దూరంగా ఉన్న నాగార్జున బుల్లితెర మీద మాత్రం అదరగొట్టేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: