బాలక్రిష్ణ టాలీవుడ్ టాప్ హీరో. ఆయన 1974లో బాలనటుడిగా పరిచయం అయినది లగాయితు ఇప్పటికి వరకూ నాటౌట్ గా అలా నటిస్తూనే ఉన్నారు. బాలయ్య కెరీర్ చాలా లాంగ్ అంటారు. ఆయన ఎన్నో పాత్రలను పోషించి తండ్రికి తగిన తనయుడు అనిపించుకున్నారు. ఇక బాలయ్య పౌరుషవంతమైన పాత్రలకు పెట్టింది పేరు. అలాంటి పాత్రలు దొరికితే బాలయ్య కుమ్మేస్తాడని, ఇక బాక్సాఫీస్ బద్దలు కావాల్సిందేనని చెప్పేందుకు అనేక సినిమాలు కూడా  ఉన్నాయి.


ఇదిలా ఉండగా బాలయ్య లేటెస్ట్ మూవీ వర్కింగ్ టైటిల్ రూలర్ షూటింగ్ దాదాపుగా పూర్తి చేసుకుందంటున్నారు. ఈ మూవీని బాలయ్య మొదట సంక్రాంతిని టార్గెట్ చేశారు కానీ ఎందుకో మళ్ళీ వెనక్కు వచ్చేశారు. ఇపుడు ఈ మూవీ డిసెంబర్ 20న రిలీజ్ అవుతుందని చిత్ర నిర్మాత సి కళ్యాణ్ ప్రకటించారు. అంటే క్రిస్మస్ ని టార్గెట్ చేసి ఈ మూవీని వదులుతున్నారన్న మాట.


అయితే ఇక్కడే అసలు చిక్కు వచ్చిపడింది. ఈ మూవీ విషయంలో పెద్ద పోటీ   ఉందని అంటున్నారు. సరిగ్గా ఇదే డేట్ ని లాక్ చేసి కూర్చున్నారు మాస్ మహారాజా రవితేజా. ఆయన నటించిన డిస్కో రాజా మూవీని డిసెంబర్  20 అని ముందే అనౌన్స్ చేశారట. ఇపుడు అదే డేట్ కి బాలయ్య మూవీ రావడంతో భారీ క్లాష్ వస్తోందని అంటున్నారు.


బాలయ్యతో రవితేజా ఓసారి సంక్రాంతికి పోటీ పడ్డారు. అప్పట్లో క్రిష్ణ మూవీతో రవితేజా  ఒక్క మగాడు బాలయ్యని ఓడించాడు. ఆ కసి బాలయ్యకు ఉంది. మరిపుడు ఇద్దరూ ఒకే రోజు మరో మారు వస్తున్నారు. ఈసారి ఎవరిని ఎవరు కొడతారో చూడాలి. రెండు సినిమాల మీద మంచి అంచనాలు ఉన్నాయి. మొత్తానికి రవితేజాతో బాలయ్య ఢీ కొట్టడం టాలీవుడ్లో చర్చగా ఉంది.



మరింత సమాచారం తెలుసుకోండి: