దసరా పండుగ రోజున మన దేశానికి వస్తున్న రాఫెల్ యుద్ధ విమానాలకు నిన్న ఫ్రాన్స్ లో మన రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆయుధ పూజ చేసి ఫ్రాన్స్ ప్రజలకు మన దసరా పండుగ గొప్పతనాన్ని పరిచయం చేసారు. అలాగే మన టాలీవుడ్ హీరోలు కూడ ఆయుధాలు పుచ్చుకుని తమ కొత్త సినిమాలకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ ను విడుదల చేసారు.  

ఈ సందర్భంలో ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీకి సంబంధించి మహేష్ గొడ్డలి పట్టుకున్న పోజు హైలెట్ చేస్తూ ఒక పోస్టర్ విడుదలచేసారు. అయితే ఈ పోస్టర్ విడుదలైన కొద్ది గంటలలోనే మహేష్ ను టార్గెట్ చేస్తూ విపరీతంగా  సెటైర్లు పడుతున్నాయి. మహేష్ డ్రెస్ మరియు పట్టుకున్న ఆయుధం మాత్రమే మారిందని మిగతాదంతా సేమ్ టు సేమ్ అంటూ జోక్స్ వేస్తున్నారు.

దీనికి సంబంధించి కొన్ని ఫోటోలను కూడ షేర్ చేస్తున్నారు. ‘భరత్ అనే నేను’ మూవీలో మహేష్  కత్తి పట్టుకున్నాడు. ‘మహర్షి’ మూవీలో ఒక ఫైట్ సీన్ లో ఒక చిన్న ఆయుధం పట్టుకున్నాడు. ‘శ్రీమంతుడు’ సినిమాలో కూడా రాడ్ లాంటిది పట్టుకున్నాడు. మహేష్ సినిమాలలో మాస్ ప్రేక్షకుల కోసం పట్టుకునే ఆయుధాలు మారుతున్నాయి కానీ మహేష్ నిల్చునే పోజు అతడి లుక్స్ తో పాటు హెయిర్ స్టైల్ ఒకే విధంగా ఉంటూ మహేష్ మారలేక పోతున్నాడు అంటూ ఇక మహేష్ మారడా అంటూ కొంతమంది ఘాటైన సెటైర్లు వేస్తున్నారు. 

మరి కొందరైతే కొండారెడ్డి బురుజు ముందు మహేష్ ఉన్న స్టిల్ ను తీసేసి ‘భరత్ అనే నేను’ లో మహేష్ స్టిల్ ను పెట్టి మార్ఫింగ్ చేస్తూ మహేష్ ఏమి మారలేదు అంటూ సాక్షాలు కూడ పెడుతున్నారు.  ఇప్పటికే ఈ సినిమా పై కొన్ని సందేహాలు కొంతమందికి వస్తున్నాయి. మహేష్ టోటల్ కామెడీకి పూర్తిగా నప్పడనీ గతంలో ఇలా ప్రయత్నించిన సినిమాలు ఒక్క ‘దూకుడు’ మినహా మరే సినిమా హిట్ కాలేదు అంటూ ‘సరిలేరు నీకెవ్వరు’ ఇంకా విడుదల కాకుండానే నెగిటివ్ ప్రచారం మొదలు పెట్టేసారు మహేష్ యాంటీ ఫ్యాన్స్.. 


మరింత సమాచారం తెలుసుకోండి: