తెలుగు చలం సచిత్ర పరిశ్రమలో ఈఏడాదిలో మొదటి నుండి అంత మంచి సినిమాలు ఏవి రాలేదని చెప్పాలి. వచ్చిన సినిమాలన్నీ కథ బాగోలేదు. లేక సినిమాలో బాగోలేదో, హీరో యాక్షన్ పెరఫార్మన్స్ బాగోలేదని మాటలతో వచ్చిన సినిమాలన్నీ కొద్దీ రోజులకే అడ్రస్ లేకుండా వెళ్లిపోయాయి. అయితే, జూన్ నుండి వస్తున్నా సినిమాలని ఓ మాదిరిగా పర్వాలేదని పించాయి. అలా చూసుకుంటే టాప్ 10 లో ఏ సినిమాలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.. 


ఈ ఏడాదిలో మొదట్లో లెక్కకు మించిన సినిమాలు దర్శనమిచ్చాయి. అందులో చాలా సినిమాలు కోలుకోలేని డిజాస్టర్స్ గా మిగిలాయి. మరికొన్ని సినిమాలు మాత్రం బాక్సాఫీస్ ను షేక్ చేశాయి. అలాంటి సినిమాలో ఏంటో ఆలస్యం చేయకుండా చూద్దాము.. 


ఎఫ్ 2 : 
విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ కామినేషన్లో వచ్చిన ఈ మల్టీస్టారర్ సినిమాకు సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమాను అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఆ సినిమాతో సినీ ఇండస్ట్రీలో మంచి బజ్ ని క్రియేట్ చేసుకుంది. 

జెర్సీ : 
న్యాచురల్ స్టార్ నాని 25 వ సినిమాగా తెరకెక్కిన ఈ సినిమాలో నాని ప్రత్యేకంగా కనిపించి మంచి హిట్ ని అందుకున్నాయి. ఈ ఏడాది విడుదలైన చిత్రాల్లో ఇది 'వన్ అఫ్ ది బెస్ట్' ఫిల్మ్‌గా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. 'అర్జున్' పాత్రలోకి నాని పరకాయ ప్రవేశం చేసి మరీ జీవించాడని.. ఫ్యాన్స్ ప్రశంసలు కురిపించారు. ఈ సినిమా తో నాని మరో హిట్ ని తన కథలో వేసుకున్నాడు. 

ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ:
సస్పెన్స్ , కొంచం మిస్టరీ గా డిటెక్టివ్ చేసిన ప్రయత్నం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. నవీన్ పోలిశెట్టి హీరోగా నటించి మంచి మార్కులను సొంతం చేసుకున్నారు. 2019 లో చిన్న సినిమా గా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. 

బ్రోచేవారెవరురా:
ఫుల్ అఫ్ కామెడీ జోనర్ తో సస్పెన్స్ త్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ తో దూసుకుపోయింది. శ్రీ విష్ణు, నివేద థామస్, నివేథా పేతురాజ్, సత్య దేవ్, రాహుల్ రామకృష్ణ, శివాజి రాజా, ప్రియదర్శిని ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటించారు. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ సినిమా మంచి హిట్ ని అందుకుంది. 

మహర్షి: 
మహేష్ బాబు ,పూజ హెగ్డే జంటగా నటించిన ఈ సినిమాకు వంశీ పైడి పల్లి దర్శకత్వం వహించారు. ఈ సినిమా కూడా రిలీజ్ మంచి హిట్ ని అందుకుంది. ఫుల్ కలెక్షన్స్ తో దూరుకుపోయింది కూడా. 

మజిలీ : 
నాగచైతన్య, తన భార్య సమంత కలిసి జంటగా నటించిన సినిమా మజిలీ.. పెళ్లైయ్యాక వీరు నటించిన మొదటి సినిమా సూపర్ డూపర్ హిట్ అందుకుంది. ఇండస్ట్రీలో మంచి పేరును కూడా అందుకుంది. 

ఇస్మార్ట్ శంకర్ :
రామ్ పోతెనేని ,నాభా నటేశ, నిధి అగర్వాల్ నటించిన ఈ సినిమాకు పూరి, ఛార్మి నిర్మించారు. ఈ సినిమా కూడా సినీ ఇండస్ట్రీలో హిట్ అందుకొని మంచి హిట్ ని అందుకుంది. 

చిత్రలహరి :
మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ నటించిన చిత్రలహరి సినిమా వచ్చింది. విజయం లేని విజయ్ గా ముందు మొదలైన సినిమా చివరికి సూపర్ గా సక్సెస్ అయ్యి మంచి ని అందుకుంది. మంచి సోషల్ మెసేజ్‌తో అద్భుతమైన డైలుగులతో కూడిన ఈ మూవీ యువతను ఆకట్టుకుంది. 2019లో వన్ అఫ్ ది బెస్ట్ మూవీ అని చెప్పాలి. 

ఓ బేబి:
సమంత సోలో గా నటించి హిట్ కొట్టిన సినిమాలలో ఈ సినిమా కూడా ఒకటి. లక్ష్మి, రాజేంద్ర ప్రసాద్, రావు రమేష్‌లు కీలక పాత్రలు పోషించారు. సమంత నటనకు ఫిదా అయినా ప్రేక్షకులు ఈ సినిమాకు మంచి పేరును తీసుకొచ్చింది. 

సైరా :
చిరంజీవి నటించిన సైరా సినిమా స్వాతంత్ర్య సమరయోదుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో తెరకెక్కింది. ఈ సినిమాలో చాలా మంది ప్రముఖులు నటించారు.  ఆ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ ని అందుకుంది. 
ఈ సినిమాలన్నీ ఈ ఏడాదిలో మంచి హిట్ ని అందుకున్న టాప్ టెన్ మూవీస్. 


మరింత సమాచారం తెలుసుకోండి: