ప్రస్తుతం దేశ వ్యాప్తంగా బయోపిక్ ల హవా నడుస్తోంది. ప్రముఖుల జీవితాల్ని వెండితెరపై చూడడానికి సగటు ప్రేక్షకుడు ఆశక్తి కనపరుస్తున్నాడు. ఎన్టీఆర్ బయోపిక్ ఫెయిల్ అయినా ఆ విషయాలు పట్టించు కోకుండా సైనా నెహ్వాల్ పుల్లెల గోపిచంద్ పివి సింధు బియోపిక్ లు తీయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.  

ఇలాంటి పరిస్థితులలో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు జార్జిరెడ్డి జీవితం పై తీస్తున్న బయోపిక్ సంచనాలు సృష్టిస్తూ మరో ‘అర్జున్ రెడ్డి అవుతుందా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. దాదాపు ఆరేళ్ల క్రితం ‘దళం’ చిత్రంతో దర్శకుడిగా పరిచియం అయిన  జీవన్ రెడ్డి ఈ చిత్రాన్ని తీస్తున్నాడు. 

ఉస్మానియా యూనివర్సిటీ రాజకీయాల నేపధ్యంలో 1967లో ఉస్మానియాలో జరిగిన వస్తవ సంఘటనలకు ప్రతిరూపంగా ఈమూవీ జార్జిరెడ్డి పుట్టింది. కేరళాలోని పాల్ఘాట్ లో పుట్టిన హైదరాబాద్ లో చదువుకున్నాడు. దూకుడు స్వభావంతో పాటు  అభ్యుదయ భావాలు కళ్లముందు అన్యాయం జరుగుతుంటే చూస్తే ఊరుకోలేని స్వభావం జార్జిరెడ్డి సొంతం. 

అవే అతన్ని వామపక్ష భావాల వైపు నడిపించి కాలేజీ దశలోనే రెబల్ గా మార్చాయి అని అంటారు. విద్యార్థి నాయకుడిగా జార్జిరెడ్డి ఆ రోజులలో ఒక వెలుగు వెలిగాడు. బాక్సింగ్ ఛాంపియన్ గా గోల్డ్ మెడల్ ని అందుకున్నాడు. అంతేకాదు ఫిజిక్స్ లో మాస్టర్ డిగ్రీ చేస్తూ చదువులో కూడ విపరీతంగా రాణించాడు.   అయితే కొన్ని అరాచక శక్తుల ప్రమేయంతో 25 ఏళ్ల వయసులోనే తన ప్రాణం  కోల్పోయి యూనివర్సిటీ రాజకీయాలలో జరిగే రాజకీయ ఆదిపత్య గొడవలకు బలి అయిపోయాడు. ఈ మూవీకి సంబంధించి నిన్న విడుదలైన టీజర్ కొన్నిగంతలలోనే వైరల్ గా మారి లక్షల స్థాయిలో వ్యూస్ మరియు లైక్ లు తెచ్చుకుంది. దీనితో త్వరలో విడుదల కాబోతున్న ఈ మూవీ అనుకోని సూపర్ హిట్ ను అందుకుని మరొక ‘అర్జున్ రెడ్డి’ అవుతుందా అంటూ అప్పుడే ఈ సినిమా గురించి బయ్యర్లు ఎంక్వైరీలు ప్రారంభించినట్లు టాక్..   


మరింత సమాచారం తెలుసుకోండి: