అందానికి మారు రూపం ప్రిన్సెస్ డయానాది. ఆమె అందమైన రూపాన్ని చూస్తే ఎంతటి వారు ఐనా  ప్రేమలో పడ్డాడం కచ్చితం. అలాంటి అందాలరాశిపై సామాన్యులు మనసు పడటం చాలా సాధారణం. కానీ ఆమె కోసం ఇద్దరు హాలీవుడ్ హీరోలు కొట్టుకోవడం పత్రిక  శీర్షికలను చాల ఆకర్షించింది. ఇంతకు ఆ ఇద్దరు హీరోలు ఎవరంటే. ప్రిన్సెస్ డయానాపై మనసు పడిన వారిలో హాలీవుడ్ హీరో  రిచర్డ్ గేరే, స్విల్వెస్టర్ స్టాలన్ అని ప్రముఖ సింగర్ ఎల్టన్ జాన్ ఇటీవల జరిగిన  ఇంటర్వ్యూలో తెలిపారు. 


డయానా కోసం హాలీవుడ్ హీరోలు కొట్టుకోవడం జరిగింది. ఈ సంఘటన లండన్‌లో వాల్ట్ డిస్నీ అధినేత జెఫరీ కాట్జెన్‌బర్గ్ ఏర్పాటు చేసిన విందులో జరిగిందని ఆయన తెలిపారు. ఆ సమయంలో ప్రిన్స్ చార్లెస్ నుంచి డయానా విడిపోయింది. అప్పడే రిచర్డ్ గేరే కూడా తన రిలేషన్‌ను సిండి క్రాఫోర్డ్‌తో తెగతెంపులు కూడా జరిగాయి. ఇది ఇలా ఉండగా అలాంటి పరిస్థితుల్లో ఆ పార్టీలో డయానా, గేరే నేరుగా కలుసుకొన్నారు. ఆమెతో మాత్రం అందరితో కలిసి కలివిడిగా మాట్లాడారు. కానీ ఆ రూమ్‌లో వారిద్దరి చూస్తే ఓ కొత్త వాతావరణం కనిపించింది అని ఎల్టన్ జాన్ తెలియచేసారు.


ఇక ప్రిన్సెస్ డయానాతో రిచర్డ్ గేరే తో ఫ్రెండ్ షిప్ చాలా క్లోజ్‌గా మారింది. అది సిల్వెస్టర్ స్టాలెన్‌కు అసలు నచ్చలేదు. దాంతో జెలసీతో స్టాలెన్ రగిలిపోయాడు. డయానాకు చేరువయ్యేందుకు ప్రయత్నం చేశాడు. పార్టీలో గందరగోళం సృష్టించడానికి ప్రయత్నం చేశారు అని ఎల్టన్ అన్నారు. ఇక ఆ పార్టీలో ఏర్పాటు చేసిన డిన్నర్‌కు గేరే, స్టాలెన్ హాజరుకాలేదు.

కానీ దూరంగా ఆ విందులో ఇద్దరు కొట్టుకోవడం, గొడవపడటం మాత్రం  కనిపించింది. ఆ గొడవ తీవ్రస్థాయికి వెళ్లి ముష్టిఘాతాలు కూడా చోటుచేసుకొన్నాయి. ఆ పరిస్థిలో కొందరు జోక్యం చేసుకోవడంతో గొడవ సద్దుమణిగింది అని ఎల్టన్ తెలియచేసారు.



మరింత సమాచారం తెలుసుకోండి: