టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో డివివి దానయ్య నిర్మాతగా అత్యంత భారీ ఖర్చుతో రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కుతున్న మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా లో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తుంటే, ఎన్టీఆర్ కొమరం భీంగా నటిస్తున్నారు. పలువురు ఇతర భాషల నటులు కూడా ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాపై టాలీవుడ్ తో సహా దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు నెలకొని ఉన్నాయి. గతంలో రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి రెండు భాగాలు మంచి విజయాలు అందుకోవడంతో ఆర్ఆర్ఆర్ పై ఊహకు అందని అంచనాలు ఏర్పడ్డాయి అని చెప్పాలి. 

ఇకపోతే ఈ సినిమా ఫుల్ టైటిల్ 'రామ రౌద్ర రుషితం' అంటూ నిన్న ఒక వార్త పలు మీడియా మాధ్యమాల్లో వైరల్ అవ్వగా, అందరూ అదే ఆ సినిమా అసలు టైటిల్ అని భావించారు. అయితే నేడు కొందరు ఆర్ఆర్ఆర్ మూవీ యూనిట్ సభ్యులు చెప్తున్న వివరాల ప్రకారం, అది పూర్తిగా అవాస్తవం అట. నిజానికి ఈ సినిమా టైటిల్ విషయమై గత కొద్దిరోజులుగా తమ యూనిట్ మొత్తం కొన్ని పేర్లు పరిశీలిస్తోందని, అయితే ఇంకా ఏది కూడా ఫైనల్ కాలేదని అన్నారట. అయితే ఈ మధ్యలోనే సడన్ గా తమ సినిమాకు 'రామ రౌద్ర రుషితం' అనే టైటిల్ నిర్ణయించనట్లు వార్తలు వైరల్ అయ్యాయని, 

కాగా అందులో వాస్తవం లేదనే విషయం ప్రేక్షకులు గ్రహించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారట. ఇక ఈ సినిమా అధికారిక టైటిల్ ని అతి త్వరలో ప్రకటించడం జరుగుతుందని, అప్పటివరకు ప్రచారం అయ్యే ఇటువంటి వార్తలను ప్రేక్షకులు నమ్మవద్దని వారు చెప్పినట్లు సమాచారం. కాగా ఈ వార్తతో నిన్నటి నుండి ఈ సినిమా టైటిల్ విషయమై జరుగుతున్న రాద్ధాంతానికి, ప్రచారం అవుతున్న ఫేక్ టైటిల్స్ కి ఒక్కసారిగా అడ్డుకట్ట పడింది...!!


మరింత సమాచారం తెలుసుకోండి: