బాలీవుడ్ మెగాస్టార్ ని టాలీవుడ్ మెగాస్టార్ తనయుడు సర్ ప్రైజ్ చేయబోతున్నాడు. బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కు రామ్ చరణ్ కాస్ట్ లీ గిఫ్ట్ రెడీ చేశాడు. విథౌట్ రెమ్యునరేషన్ సైరాలో నటించినందుకు గాను మెగా ఫ్యామిలీ అమితాబ్ కు అరుదైన బహుమతి సిద్ధం చేసినట్టు సమాచారం. 


బిగ్ బి అమితాబ్ బచ్చన్ జెంటిల్ మెన్ యాటిట్యూడ్ గురించి తెలిసిందే. స్నేహం కోసం ఏం చేయడానికైనా ఈ లెజండరీ స్టార్ మందుంటాడు. ఇప్పటికే షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ లాంటి స్టార్స్ కోసం పైసా తీసుకోకుండా సినిమాల్లో నటించాడు. మెగాస్టార్ చిరంజీవితో ఉన్న ఫ్రెండ్ షిప్ వల్ల అమితాబ్ అసలు స్టోరీ వినకుండా పైసా పారితోషికం తీసుకోకుండా ఫ్రీగా నటించాడు. అంత ప్రేమ చూపించిన బిగ్ బీకి రామ్ చరణ్ తేజ్ స్పెషల్ గిఫ్ట్ ఇవ్వబోతున్నాడని తెలుస్తోంది.


సైరా నరసింహారెడ్డి చిత్రంలోనూ అమితాబ్ బచ్చన్ గోసాయి వెంకన్నగా చిరంజీవి గురువు పాత్రలో నటించాడు. ఈ సినిమాకు ముఖ్యమైన పాత్ర కావడంతో ఏరికోరి చిరంజీవే బిగ్ బీ కావాలని తీసుకున్నాడట. చిరంజీవి ఓ మాట అడగ్గానే మరో ఆలోచన లేకుండా సైరాలో నటిస్తున్నట్టు అమితాబ్ మాట ఇచ్చారు. అంతేకాదు రెమ్యునరేషన్ తీసుకోకపోవడంతో పాటు షూటింగ్ జరిగినన్ని రోజులు సొంత ఖర్చుల మీద అమితాబ్ ముంబై నుంచి వచ్చి వెళ్లడం విశేషం. ఆయన స్నేహాన్ని వెలకట్టలేమని చెప్పిన చిరు ఇపుడు స్పెషల్ కారు గిఫ్ట్ గా ఇవ్వబోతున్నాడట. 


కొణిదెల ప్రొడక్షన్స్ తరఫున మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ప్రేమతో అమితాబ్ కు ఖరీదైన కారును సిద్ధం చేశాడని చెబుతున్నారు. రోల్స్ రాయిస్ ఫాంటమ్ లగ్జరీ కార్ ని కానుకగా ఇచ్చేందుకు రామ్ చరణ్ ప్లాన్ చేశాడట. అమితాబ్ గ్యారేజీలో ఇప్పటికే బోలెడన్ని ఖరీదైన కార్లు ఉన్నాయి. వాటిలో చరణ్ ఇచ్చే కార్ చాలా స్పెషల్ గా మెరవనుందని తెలుస్తోంది. ఈ కారు ఖరీదు ఆన్ రోడ్ ఆరు కోట్ల రూపాయలు విలువ చేస్తుందని సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: