హైదరాబాద్ లో ఒక అమ్మాయికి మీకీ ఆ రోల్ ఇపిస్త అంటూ నమిచ్చి మోసంచేశాడు. సీరియల్‌లో ఛాన్స్ ఇప్పిస్తానంటూ మాయమాటలు కూడా చెప్పాడు. ఇంత వరకు చాల బాగానే ఉన్నా.. అసలుకే మోసం వచ్చి పడింది. రోల్ లేదు, సీరియల్ లేదు.. ఉల్టా లక్ష రూపాయల వరకు నొకేయసాడు ఆ మోసగాడు. ఇక వివరాల్లోకి వస్తే హైదరాబాద్‌కు చెందిన మహిళను ముంబైకి చెందిన ఒక మాయగాడు మోసం చేసిన సంఘటన నెలకొంది. 


హైదరాబాద్‌లోని రాంకోఠి ప్రాంతానికి చెందిన 40 సంవత్సరాల మహిళకు యాక్టింగ్ అంటే అమితమైన ప్రేమ మరియు ఇష్టం. ఆ క్రమంలో ఆమె మోడల్‌గా, చిన్న చిన్న పాత్రల్లో నటిస్తూ ఉన్నారు . అయితే ఇటీవల ముంబైకి చెందిన అంజు అలియాస్ చక్రవర్తి అనే వ్యక్తి ఫేస్‌బుక్‌లో పరిచయమయ్యాడు. అదే ఆమెకు ఒక పెద్ద తంటా తెచ్చి పెట్టింది. ఆ పరిచయంతో కాస్తా ఆమెను బాగా బురిడీ కొట్టించాడు ఆ వ్యక్తి. పెద్ద యాడ్‌లో నటించే అవకాశం ఇప్పిస్తానని మాయ మాటలు చెప్పి తీర చూస్తే మోసం చేసాడు.


ఫలానా యాడ్‌లో మీరే నటిస్తున్నారంటూ చెప్పుకొచ్చిన అంజు.. మిగతా వివరాలు మా అసిస్టెంట్ రాకేశ్ తెలియచేస్తాడు అని తెలిపాడు. ఆ క్రమంలో లైన్లోకి వచ్చిన రాకేశ్.. అది ఇదంటూ ఫీజుల పేరిట భారీగా డబ్బులు కాజేయసాడు. చివరకు విమాన టికెట్లు బుక్ చేయిస్తానంటూ ఆమె నుంచే ఇంకా కొంత డబ్బును కూడా తీసుకున్నాడు. ఇదంతా కూడా అంజు అంగీకారంతోనే జరిగింది. డబ్బులు తీస్కున్నారే తప్ప రోల్ గురించి మాట్లడిందే లేదు అసలు.


ప్రతిసారి వాళ్లు డబ్బులు అడగటం.. ఈమె వాళ్ళకి ఇవ్వడం.. అదే పనిగా మారింది. అంతేకాదు తమకు కమిషన్ కూడా కావాలి అని  మరో 15 వేల రూపాయలు దాక కూడా నొక్కేశారు. అలా ఆమె నుంచి లక్ష రూపాయల దాకా వసూలు చేసిన ఆ కేటుగాళ్లు ఆ తర్వాత ఇద్దరి  ఫోన్లు స్విచ్చాఫ్ చేశారు. అప్పటికీ గానీ తాను మోసపోయిన విషయం గుర్తించలేదు ఆ బాధితురాలు. చివరకు సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులను సంప్రదించి కేసు నమోదు చేసింది.


మరింత సమాచారం తెలుసుకోండి: