సైరా సినిమా విజయోత్సాహంలో ఉన్న మెగా స్టార్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా తన 152వ సినిమా మొదలు పెట్టాడు. కొరటాల శివ డైరెక్షన్ లో ఈ సినిమా వస్తుంది. దసరా సందర్బంగా ఈ మూవీ ముహూర్త కార్యక్రమాలు పూర్తి చేసుకున్నాయి. ఈ సినిమా కొణిదెల ప్రొడక్షన్ తో పాటుగా మ్యాట్నీ మూవీస్ బ్యానర్ లో నిర్మించబడుతుంది. 

 

ఈ మూవీకి సంబందించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది. సినిమాలో చిరంజీవితో పాటుగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తాడట. అంటే ఈ మూవీ మల్టీస్టారర్ గా వస్తుందా అంటే అలా కాదు కాని చిరంజీవి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ లో చరణ్ కనిపిస్తాడట. 

 

అలా అయినా కూడా చిరు చరణ్ ఇద్దరినీ ఓకే సినిమా లో చూసే అవకాశం మెగా ఫాన్స్ కు దక్కినట్టే.  మిర్చి నుండి భరత్ అనే నేను వరకు వరుసగా హిట్లు కొడుతున్న కొరటాల శివ చిరుతో కూడా హిట్టు కొట్టడం పక్కా అంటున్నారు. ఇక సినిమాలో చరణ్ కూడా ఉన్నాడని తెలిసే సరికి అంచనాలు మరింత పెరిగాయి. 

 

సైరా తర్వాత చిరు..  RRR తర్వాత రామ్ చరణ్ ఈ మూవీతోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి కథతో వస్తుంది..  ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుంది అన్నది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: