ఈ సంవత్సరం తెలుగులో బిగ్గెస్ట్ మూవీగా రిలీజ్ అయ్యింది మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘సైరా నరసింహారెడ్డి. అలాగే బాలీవుడ్ లో స్టార్ హీరోస్ హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ నటించిన వార్ ఎన్నో అంచనాల మద్య రిలీజ్ అయ్యింది.  అయితే ఈ రెండు సినిమాలు అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా రిలీజ్ అయ్యాయి.  మెగాస్టార్ నటించిన ‘సైరా’ నాలుగు భాషలు తెలుగు, మళియాళ, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ అయ్యాయి.  బాహుబలి సినిమా తర్వాత స్టార్ హీరోల సినిమాలు మల్టీ లాంగ్వేజ్ రూపొందుతున్నాయి. 

ఈ నేపథ్యంలో ‘సైరా’ బాలీవుడ్ లో రిలీజ్ అవుతున్న సందర్భంగా చిరంజీవి, రాంచరణ్ లు అక్కడ పెద్ద ఎత్తున ప్రమోషన్ చేసిన విషయం తెలిసిందే. అంతే కాదు ఈ మూవీలో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబచ్చన్ ఓ ప్రధాన పాత్రలో నటించారు. ఇక హృతిక్‌ రోషన్‌, యాక్షన్‌ స్టార్‌ టైగర్‌ ష్రాఫ్‌ తొలిసారి కలిసి నటించిన మూవీ ‘వార్‌’. భారీ బడ్జెట్‌,  అంతకుమించిన భారీ యాక్షన్‌ సన్నివేశాలతో తెరకెక్కిన ఈ సినిమాపై మొదటి నుంచి భారీ అంచనాలే నెలకొన్నాయి.  బాలీవుడ్ లో ‘సైరా’ తో ఢీకొన్న వార్ మంచి సక్సెస్ సాధించిందని అంటున్నారు.

కాగా, అన్ని భాషల్లో సైరా పై వస్తున్న నెగిటీవ్ టాక్ ‘వార్’ కి ప్లస్ పాయింట్ అయ్యింది. దాంతో ఇప్పుడు బాలీవుడ్ లో  ‘వార్‌’ సినిమా కలెక్షన్స్ లో దూసుకుపోతోంది. కేవలం వారం రోజుల్లోనే ఇండియాలో నెట్‌ వసూళ్లు రెండు వందల కోట్లు వచ్చి ట్రేడ్ లో రికార్డ్ క్రియేట్ చేసింది వార్. ఈ సంవత్సరం లో ఇంతవరకు బాలీవుడ్‌ నుంచి మూడు వందల కోట్ల నెట్‌ వసూలు చేసిన సినిమా రాలేదు. ఆ లోటుని వార్‌ తీర్చేయనుందని అర్దమవుతోంది.  త్వరలో ఈ మూవీ మూడు వందల కోట్ల క్లబ్ లో చేరడంలో ఆశ్చర్యం లేదు అంటున్నారు బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు. 


మరింత సమాచారం తెలుసుకోండి: