అన్వేష్, సారికలను హీరోహీరోయిన్స్  పరిచయం చేస్తూ మాధవి కేసాని దర్శకత్వంలో జి.ఎస్. జాషువా రాజు నిర్మిస్తున్న చిత్రం 'జిగేల్ రాజా'. శ్రీ రిత్విక ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ‌రంగం స‌తీష్‌కుమార్ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో బుధవారం ఫిల్మ్ నగర్ లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది.   ఈ చిత్రానికి తెలంగాణ ఫిలిం ఛాంబ‌ర్ చైర్మ‌న్ ప్ర‌ధాని రామ‌కృష్ణ గౌడ్ క్లాప్ కొట్ట‌గా  టీ మా సెక్ర‌ట‌రీ స్నిగ్ధ కెమెరాస్విచ్ ఆన్ చేశారు. శ్రీ‌రంగ స‌తీష్ గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో... 


ప్రధానిరామ‌కృష్ణ గౌడ్ మాట్లాడుతూ... శ్రీ‌రంగం స‌తీష్ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో జెజెక్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై జె.ఎస్‌.జాఘవా రాజు  ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రొడ్యూస‌ర్‌గా ఇది ఆయ‌న రెండ‌వ చిత్రం. ఈ చిత్రంతో మాధ‌వికేసాని లేడీ డైరెక్ట‌ర్‌గా ప‌రిచ‌యం చేస్తున్నారు. ఇండస్ట్రీకి సినిమా మీద ఉన్న ప్యాష‌న్ తో వ‌చ్చే చిన్న నిర్మాత‌ల‌ను మేము ఎప్పుడూ ఎంక‌రేజ్ చేస్తూనే ఉంటాము. చిన్న సినిమాలు ఎక్కువ రావ‌డం వ‌ల్ల ఎక్కువ మంది టెన్నీషిన్ల‌కి ప‌ని దొరుకుతుంది. ఈ చిత్రంలో న‌టిస్తున్న ప్ర‌తి ఒక్క‌రికి నా ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు. ఈ చిత్రం చాలా డిఫ‌రెంట్ గా ఉంటుంది. త‌ప్ప‌కుండా హిట్ అవుద్ది. రాజుగారికి ఈ చిత్రంతో మంచి హిట్ కొట్టి మ‌రో సినిమాని తియ్యాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్నాను. యూనిట్ అంద‌రికీ ఆల్ ద బెస్ట్ అన్నారు.


టీ మా సెక్ర‌ట‌రీ స్నిగ్ధ మాట్లాడుతూ... జిగేల్‌రాజా సాంగ్ ఎంత సూప‌ర్ బంప‌ర్ హిట్ అయిందో ఈ సినిమా కూడా  అలాగే హిట్ కావాల‌ని కోరుకుంటున్నాను.  ఈ చిత్రంలో న‌టించే ప్ర‌తి ఒక్క‌రికి పేరు పేరున నా కృత‌జ్ఞ‌త‌లు అన్నారు.


శ్రీ‌రంగం స‌తీష్ మాట్లాడుతూ... ఈ ప్రాజెక్ట్‌ని ఎంతో క‌ష్ట‌ప‌డి మూడు నెల‌లు నుంచి జాషువా గారు నేను మాట్లాడుకుని ముందుకు తీసుకువ‌చ్చాం. హీరో హీరోయిన్లు కొత్త‌వారైనా చాలా టాలెంటెడ్ ప‌ర్సెన్స్‌. స‌బ్జ‌క్ట్‌కి అనుకూలంగా వాళ్ళ‌ని తీసుకోవ‌డం జ‌రిగింది.  ఇంకా ఈ చిత్రంలో సుమ‌న్‌, పోసాని లాంటి పెద్ద పెద్ద ఆర్టిస్టుల‌ను తీశాం. నాకు రామ‌కృష్ణ‌గారితో ఎప్ప‌టినుంచో ప‌రిచ‌యం.  హైద‌రాబాద్ ప‌రిస‌ర ప్రాంతాల్లో షూటింగ్ చేస్తాం. ఈ రోజు నుంచి ఫ‌ప్ట్ షెడ్యూల్ ప్రారంభం అయింది అని అన్నారు.
ప్రొడ్యూస‌ర్ జాషువా రాజు మాట్లాడుతూ... 2003లో ఒక చిత్రాన్ని తీశాను. మ‌ళ్ళీ ఇప్పుడే రెండో సినిమా తీస్తున్నాను. డైరెక్ట‌ర్ కొత్త హీరో హీరోయిన్స్‌తో ఈ చిత్రం చేస్తున్నాము. ప్రాడ‌క్ట్ ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా చాలా బాగా ఈ చిత్రాన్ని తీస్తున్నాము అన్నారు. 


మాధ‌వి మాట్లాడుతూ... డైరెక్ట‌ర్‌గా న‌న్ను తీసుకున్నందుకు జాషువాగారికి నా ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు. మంచి చిత్రంతో మీ ముందుకు వ‌స్తున్నాం అంద‌రూ త‌ప్ప‌కుండా ఆద‌రించాల‌ని కోరుకుంటున్నాను.  మంచి లొకేష‌న్స్‌లో షూటింగ్ స్టార్ట్ చేశాము. 


మరింత సమాచారం తెలుసుకోండి: