ప్యాన్ ఇండియా మూవీకి కేరాఫ్ అడ్రస్ గా ఎస్ ఎస్ రాజమౌళిని చెప్పుకోవాలి. రాజమౌళి కనుక బాహుబలి సిరీస్ తీయకపోతే టాలీవుడ్ ఎక్కడ ఉండేదో అన్న ఆలోచన కూడా వస్తుంది. బాహుబలితో తెలుగు సినిమా స్టామినాను ఒక్కసారిగా పెంచేసిన ధీరుడు రాజమౌళి. ఆయన్ని ఓ విధంగా డైరెక్టర్లలో మెగాస్టార్ అని చెప్పాలేమో. అపట్లొ తెలుగు సినిమా వసూళ్ళను కోట్లకు పడగలు ఎత్తించిన ఘనత చిరంజీవిది. ఇపుడు ఖండాంతరాలకు తెలుగు సినిమాను తీసుకుపోయిన ఘనత కచ్చితంగా రాజమౌళిదే.


మరి ఇంతటి క్రెడిట్ సంపాదించిన రాజమౌళిని చూసి అసూయ పడే వారు ఉన్నారు. ఆయన బాటలో నడిచేవారూ ఉన్నారు. బాహుబలి తరువాత వరసగా రెండు ప్యాన్ ఇండియా మూవీస్ వచ్చాయి. అవి సాహో, సైరా. ఈ రెండూ కూడా బాహుబలి మ్యాజిక్ ని సాధించడంలో విఫలం అయ్యాయి. బాహుబలికి మాత్రమే సాధ్యమైన అద్భుతం వీటిని ఎందుకు దక్కలేదు అంటే మళ్ళీ రాజమౌళి గురించే చెప్పుకోవాలి.రాజమౌళి ఉండబట్టే బాహుబలి అలా అధ్బుతం క్రియేట్ చేసింది తప్ప ఆ సినిమాకు వేరే డైరెక్టర్ అయితే టాలీవుడ్ దాటి వెళ్ళదన్న వారూ ఉన్నారు. ఇక బాహుబలి తరువాత భుజాలు ఎగరెసిన తెలుగు సినిమాకు మళ్ళీ ఆ అద్రుష్టం కలగలేదు. దీంతో ప్యాన్ ఇండియా మూవీ కోసం కలవరించేవారంతా రాజమౌళి వైపే చూస్తున్నారట.


దాంతో రాజమౌళి మీద ఇపుడు ఎక్కడలేని టెన్షన్ పడుతోందని అంటున్నారు. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న ఆర్ ఆర్ ఆర్ మూవీ విషయంలో రాజమౌళి ప్రాణం పెట్టి పనిచేస్తున్నారు. కానీ ఇక్కడ ఆయన అనుకున్నట్లుగా వర్క్ జరుగుతోందా అన్నదే డౌట్ అంటున్నారు. బాహుబలి  విషయంలో మొత్తం ఆర్టిస్టులు అంతా రాజమౌళికి సహకరించారు. ప్రభాస్ అయితే ఏకంగా అయిదేళ్ల పాటు కాలాన్ని మూటకట్టి రాసిచ్చేశాడు.మరి ఆర్ ఆర్ ఆర్ లో పనిచేస్తున్న వారు కానీ ఆర్టిస్టులు కానీ అంతటి అంకితభావం చూపిస్తున్నారా అన్నది చూడాలి.



పైగా వారు వేరే వ్యాపకాలతో బిజీగా ఉంటున్నారు. దాంతో ఓ తపస్సుగా బాహుబలి రెండు పార్టులూ తీసిన రాజమౌళికి ఇపుడు ఆర్ ఆర్ ఆర్ తెగ టెన్షన్ పెడుతోందని టాక్ నడుస్తోంది. తాను ఏర్పాటు చేసిన బెంచ్ మార్క్ ని తానే బద్దలు కొట్టడం ఒక పెద్ద చాలెంజ్ రాజమౌళికి అయితే మరో చాలెంజ్ ఈ మూవీని ఘనమైన ప్యాన్ ఇండియా మూవీగా తీయడం. వరసగా రెండు మూవీస్ ప్యాన్ ఇండియా పేరు చెప్పుకుని ఫట్ మనడంతో రాజమౌళి మీద అలా ఇలా వత్తిడి లేదుట. మరి ఆయన ఏంచేస్తారో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: