రాహుల్ మూవీ మేకర్స్ స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ ఫస్ట్ లుక్ & ట్రైలర్ లాంచ్ కార్యక్రమం హైదరాబాద్ లో జరిగింది. ప్రముఖ దర్శకుడు సుకుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొని ట్రైలర్ విడుదల చేశారు.
 ఈ సందర్భంగా చిత్ర నిర్మాత బి.ఓబుల్ రెడ్డి మాట్లాడుతూ...
మంచి సందేశం ఉన్న కథతో స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమా తీయ్యడం జరిగింది. నేను తెలుగులో తీసున్న మూడో సినిమా ఇది. డైరెక్టర్ కరుణ కుమార్ సినిమాను బాగా హ్యాండిల్ చేశాడు.  హీరో  శ్రీనాధ్ మాగంటి బాగా నటించాడు. హరిప్రసాద్ గారు మాకు మంచి కథను అందించారు. డబ్బు వస్తుందా లేదా అనే విషయాలు పక్కన పెడితే మంచి సినిమా తీశానన్న తృప్తి ఉందన్నారు.


డైరెక్టర్ సుకుమార్ మాట్లాడుతూ..
పోస్టర్, ట్రైలర్ బాగున్నాయి. డిస్టిబ్యూటర్స్ ఈ సినిమాను తీసుకోవాలి అనుకునేలాగా అట్రాక్టుగా ఉన్నాయి. ఈ సినిమాకు కథ అందించిన హరి ప్రసాద్ నాకు 1 నేనొక్కడినే, 100%లవ్ చిత్రాలకు కథ అందించారు. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఈ  సినిమాకు ఎలాంటి కథ ఇచ్చి ఉంటాడో. డైరెక్టర్ కరుణ కుమార్ హరి ప్రసాద్ అందించిన కథను అద్భుతంగా తెరకెక్కించి ఉంటాడని భావిస్తున్నాను అన్నారు. 


డైరెక్టర్ కరుణ కుమార్ మాట్లాడుతూ...
నా నిర్మాత ఓబుల్ రెడ్డి సినిమాను ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారు. హీరో , హీరోయిన్స్ ఈ చిత్రానికి పని చేసిన టెక్నీషియన్స్ కు ప్రేత్యేక కృతజ్ఞతలు. నా మిత్రుడు హరి ప్రసాద్ చక్కటి మెసేజ్ ఉన్న కథను అందించాడు. సినిమా అందరికి నచ్చుతుందని భావిస్తున్నాను. ఆత్మహత్య సమస్యకు పరిష్కరం కాదని ఈ సినిమాలో చెప్పడం జరిగింది. అందరికి ఈ పాయింట్ కనెక్ట్ అవుతుంది అన్నారు.


జర్నలిస్ట్ ప్రభు మాట్లాడుతూ...
మంచి చిత్రాలకు మీడియా ఎప్పుడూ సపోర్ట్ చేస్తూ ఉంటుంది.ఈ చిత్ర ఫస్ట్ లుక్ లాంచ్ చెయ్యడం సంతోషం, ఈ సినిమా స్టూడెంట్స్ మీద తీసిన కథాంశం. ప్రస్తుతం జరుగుతున్న సంఘటనలు ఆధారంగా ఈ సినిమా ఉండబోతోంది. నిర్మాత ఓబుల్ రెడ్డికి ఈ సినిమా మంచి పేరు తెచ్చి పెడుతుందని భావిస్తున్నాం అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: