టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా సినిమా సైరా నరసింహారెడ్డి ఇటీవల గాంధీ జయంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. స్వాతంత్రోద్యమ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ సినిమా, యావరేజ్ టాక్ ని సంపాదించి ప్రస్తుతం మెల్లగా నత్తనడకన ముందుకు సాగుతోంది. మెగాస్టార్ సరసన నయనతార హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో పలు భాషలకు చెందిన కొందరు దిగ్గజ నటులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించడం జరిగింది. ఇకపోతే ప్రస్తుతం ఈ సినిమా చాలా తక్కువ స్థాయిలో కలెక్షన్స్ ని రాబడుతుండడంతో, దీనిపై కొందరు ట్రేడ్ విశ్లేషకులు చెప్తున్న లెక్కల ప్రకారం, 

మరికొద్దిరోజుల్లో ఓవర్ ఆల్ గా క్లోసింగ్ సమయానికి ఈ సినిమా చాలా వరకు బయ్యర్లకు నష్టాలు మిగిల్చే అవకాశాలు మెండుగా ఉన్నాయట. ఇకపోతే ఇటీవల యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మరియు సుజిత్ ల కాంబినేషన్లో వచ్చిన సాహో సినిమా కూడా ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయి, బాక్సాఫీస్ దగ్గర చతికిల పడింది. అయితే ఆ సినిమా బాలీవుడ్ లో బాగానే కలెక్షన్స్ రాబట్టగా, ఇక్కడ మాత్రం ఒక మోస్తరు పర్వాలేదనిపించింది. ఇక నేడు కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి వినిపిస్తున్న టాక్ ప్రకారం, ఓవర్ ఆల్ గా సైరాకు రాబోయే నష్టాన్ని అంచనా వేస్తే, దానికంటే సాహోనే ఒకింత బెటర్ అని అంటున్నారు. 

అయితే ఇప్పటికే సైరా వంద కోట్ల షేర్ మార్కుని అందుకున్నప్పటికీ, బయ్యర్లు బ్రేక్ ఈవెన్ ని చేరుకోవాలంటే మాత్రం మరొక తొంభై కోట్లవరకు రాబట్టవలసి ఉందని, ప్రస్తుత పరిస్థితుల్లో అది చాలావరకు అసాధ్యం అని అంటున్నారు. అయితే సైరాకు కొంతవరకు ప్రమోషన్స్ మరియు పబ్లిసిటీ వంటి అంశాలు ఎంతో దెబ్బేసాయని, సినిమాను ఎంతో ఖర్చు పెట్టి రెండున్నరేళ్ల పాటు తెరకెక్కించిన సినిమా యూనిట్, చివర్లో ప్రమోషన్స్ పై మరింత దృష్టి పెట్టి ఉంటె ఈపాటికి సైరా ఒకింత బెటర్ గా కలెక్షన్స్ అందుకుని ఉండేదని అంటున్నారు. మరి సైరా విషయంలో చివరకు ఏమి జరుగుతుందో చూడాలి........!! 


మరింత సమాచారం తెలుసుకోండి: