తెలంగాణలో ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్యమం అనగానే వెంటనే గుర్తుకు వచ్చేది..జార్జ్ రెడ్డి. అందరికీ న్యాయం చేయాలి..కుఠిల రాజకీయాలపై కన్నెర్ర జేసి అతి చిన్న వయసులోనే అసువులు బాసిన టాప్ ర్యాంకర్ జార్జిరెడ్డి.  25 ఏళ్ల వయసులో, ఉస్మానియా ఆవరణలో 30 మంది మూకుమ్మడిగా కత్తులతో చేసిన దాడిలో హత్యగావించ‌బ‌డ్డాడు. ఎంతో మంది విద్యార్థులకు ఉద్యమ స్ఫూర్తి మిగిల్చిన జార్జిరెడ్డి త్యాగాన్ని ఉస్మానియా యూనివర్సిటీ..ఆ పరిసర ప్రాంతాలు ఎప్పటికీ మర్చిపోలేవు. ప్రస్తుతం టాలీవుడ్ లో వరుస బయోపిక్ సినిమాలు వస్తున్న విషయం తెలిసిందే. 

ఈ నేపథ్యంలో చరిత్ర మరచిపోయిన ఓ విద్యార్థి నాయకుడి జీవితాన్ని వెండితెరపై ‘జార్జిరెడ్డి’గా ఆవిష్కరిస్తున్నారు. 1965 నుంచి 1975 వరకు ఉస్మానియా విశ్వ విద్యాలయంలో చదువుకున్న ప్రతి ఒక్కరికీ జార్జిరెడ్డి గురించి తెలుసు.  మంచి టాప్ ర్యాంక్ విద్యార్థి అయిన జార్జిరెడ్డి తన కళ్లముందు జరుగుతున్న అన్యాయాలపై ప్రతిఘటించారు..తమ కాలేజీలో ఇతరుల పెత్తనాలు ఏంటీ అని ప్రశ్నించారు..విద్యార్థులను రాజకీయ నాయకులు పావుల్లా వాడుకుంటున్న సమయంలో వారిని వ్యతిరేకించి పోరాటం చేశాడు..దాని ఫలితంగా ఆయన్ని నమ్మించి అతి దారుణంగా హత్య చేశారు. అలాంటి ఉద్యమ  నేత గురించి ఈ తరం తెలుసుకునేందుకు రూపొందించిన జార్జ్ రెడ్డి ట్రైలర్ రిలీజ్ మంగళవారం విడుదలైంది.

సిల్లీ మాంక్స్, త్రీ లైన్ సినిమా బ్యానర్స్ తో కలిసి మైక్ మూవీస్ అధినేత అప్పిరెడ్డి నిర్మించిన ఈ మూవీకి ‘దళం’ ఫేమ్ జీవన్ రెడ్డి దర్శకత్వం వహించారు.  వంగ వీటి మూవీతో ఆకట్టుకున్న సందీప్ మాధవ్ జార్జ్ రెడ్డి పాత్రలో ఇమిడి పోయారు. సత్యదేవ్, మనోజ్ నందం, అభయ్ బేతిగంటి కీలక పాత్రల్ని పోషిస్తున్నారు. తాజాగా ఈ ట్రైలర్ కి సోషల్ మీడియాలో అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. ఈ మూవీ ఖచ్చితంగా సూపర్ హిట్ కావడం ఖాయం అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: