బాహుబలి దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మల్టీస్టారర్ మూవీ R R R. వ‌చ్చే యేడాది జూలైలో రిలీజ్ అవుతోన్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్ గిరిజ‌నుల ఆరాధ్య‌దైవం కొమ‌రం భీంగాను, రామ్‌చ‌ర‌ణ్ అల్లూరి సీతారామ‌రాజుగాను న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ రెండు పాత్ర‌లు చాలా ప్రాముఖ్యం ఉన్న‌వి కావ‌డంతో ఆడియెన్స్ ఈ పాత్రలకు ఫిదా కావడం పక్కా అని సినిమా మొదట్నుండీ చిత్ర యూనిట్ తెలిపింది.


బాహుబ‌లి సీరిస్ సినిమాల త‌ర్వాత రాజ‌మౌళి అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిస్తోన్న సినిమా కావ‌డంతో ఈ సినిమాపై ముందు నుంచి ఇండియా వైజ్‌గా మంచి అంచ‌నాలు ఉన్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ షాకింగ్ న్యూస్ తాజాగా బయటకు వచ్చింది. ఈ సినిమా షూటింగ్ నుంచి ఎన్టీఆర్ బ‌య‌ట‌కు వ‌చ్చేశాడ‌ట‌. అయితే ఈ న్యూస్ చూసి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆందోళ‌న చెందాల్సిన ప‌నిలేదు.


ఆర్ ఆర్ ఆర్ నుంచి ఎన్టీఆర్ శాశ్వ‌తంగా బ‌య‌ట‌కు రావ‌డం లేదు. ఈ సినిమా కోసం రామ్‌చ‌ర‌ణ్ ఎన్నోసార్లు బ్రేక్ తీసుకున్నా ఎన్టీఆర్ మాత్రం కంటిన్యూగా షూటింగ్‌లో పాల్గొన్నాడు. సైరా సినిమా నుండి ఫ్రీ అయిన చరణ్ ఇప్పుడు R R R సినిమా షూటింగ్‌లో నటిస్తాడు. కాగా ఎన్టీఆర్ ఇప్పుడు తన ఫ్యామిలీతో సమయం గడపనున్నాడు. ఇక చరణ్ ఇప్పుడు కంటిన్యూగా సినిమా షూటింగ్‌లో పాల్గొంటాడు. ఇది అస‌లు క‌థ‌.


ఇక డీవీవీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై డీ పార్వ‌తి స‌మ‌ర్ప‌ణ‌లో డీ దాన‌య్య ఈ సినిమాను రు.250 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో నిర్మిస్తున్నారు. విన‌య విధేయ రామ త‌ర్వాత రామ్‌చ‌ర‌ణ్‌, అర‌వింద స‌మేత వీర‌రాఘ‌వ త‌ర్వాత ఎన్టీఆర్ న‌టిస్తోన్న సినిమా కావ‌డంతో తెలుగులో ఈ సినిమాపై ఎలాంటి అంచ‌నాలు ఉన్నాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: