బాలీవుడ్ లో సక్సస్ ఫుల్ సిరీస్ హౌస్ ఫుల్ సినిమా. ఈ సినిమా సిరీస్ లన్నీ ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాదు బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించాయి. అందుకే మళ్ళీ బ్లాక్ బస్టర్ అందుకునే విధంగా ఈ సిరీస్ నుండి వస్తున్న నాలుగో భాగమే హౌస్ ఫుల్ 4. భారీ తారాగణంతో ఈ సినిమా తెరకెక్కించబడింది. గత రెండేళ్ళగా ఫుల్ స్వింగ్ లో ఉన్న అక్షయ్ కుమార్ సహా బాలీవుడ్ టాప్ స్టార్స్ అందరు నటించారు. ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ నుండే బాలీవుడ్ తో పాటే తెలుగు ప్రేక్షకుల్లోను ఈ సినిమా మీద బాగా అంచనాలు మొదలయ్యాయి.  ఇక బాలీవుడ్ లో హౌస్ ఫుల్ 4 ప్రస్తుతం హాట్ టాపిక్. దీపావళి కానుకగా ఈ భారీ మల్టీస్టారర్ ని రిలీజ్ చేయనున్నారు. ఈ సందర్భంగా చిత్రబృందం ప్రచార కార్యక్రమాల్లో బిజీబిజీగా ఉన్నారు. 

ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన రకరకాల పోస్టర్లు రిలీజై సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారుతున్న సంగతి తెలిసిందే. ఇంతకు ముందు హౌస్ ఫుల్ 4 (హెచ్.ఎఫ్- 4) చిత్రంలో పూజా హెగ్డే లుక్ సహా కాస్టింగ్ మొత్తం గెటప్ లు ఎలా ఉంటాయో పోస్టర్లను రివీల్ చేయగా అవి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.ఇక ఆసక్తికరంగా పునర్జన్మల నేపథ్యంలో కన్ఫ్యూజన్ కామెడీతో చాలా కొత్తగా దర్శకుడు ఫర్హాద్ సామ్జీ డిజైన్ చేశారని అర్థమవుతోంది. పునర్జన్మల నేపథ్యం.. అందులోనే కన్ఫ్యూజన్ నుంచి పుట్టుకొచ్చే కామెడీ ఈ సినిమాలో హైలైట్ గా ఉంటుందట. అంటే ప్రతి పాత్ర రెండు కాలాల్లో కనిపిస్తారని తెలుస్తోంది. ప్రెజెంట్ కి కనెక్టివిటీ ఉంటుంది. అందుకు తగ్గట్టే గెటప్పులు మారుతుంటాయి. 1419లో .. 2019లో కథ సాగుతుందని ఇంతకముందే చిత్ర బృందం రివీల్ చేశారు. ఆ రెండు కాలాలాకు  కనెక్టివిటీ ఉంటుంది. ఇక ఈ సినిమాలో అక్షయ్ కుమార్ గుండు బాస్ గెటప్ లోనూ కనిపిస్తున్నారు. 

కృతి సనన్- కృతి కర్భంద- పూజా హెగ్డే లాంటి హాట్ బ్యూటీస్ అభిమానులకు గ్లామర్ ట్రీటివ్వబోతున్నారు. తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఓ కొత్త పోస్టర్ ని సోషల్ మీడియాల్లో రివీల్ చేశారు. ఈ పోస్టర్ లో అందరు స్టార్లతో పాటుగా బాబి డియోల్ కనిపిస్తున్నారు. అక్షయ్ - రితేష్ సహా కథానాయికలు రకరకాల ఎక్స్ ప్రెషన్స్ ఇస్తే బాబి డియోల్ మాత్రం అలా సింపుల్ గా చూస్తూ ఉన్నాడు. ఫర్హాద్ సామ్జీ దర్శకత్వంలో సాజిద్ నడియావాలా ఈ సినిమా నిర్మిస్తున్నారు. దీపావళికి ప్రేక్షకులను అలరించడానికి థియోటర్స్ లోకి రాబోతోంది. వరుస హిట్స్ అందుకుంటున్న అక్షయ్ కుమార్ మరో భారీ హిట్ తన ఖాతాలో వేసుకోబోతున్నారని ఈ సినిమా ట్రైలర్స్, సాంగ్ ప్రోమోస్ చూస్తుంటే అర్థమవుతోంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: