సినిమా స్టార్స్ ను మించి, క్రికెటర్స్, బ్యాడ్మింటన్ స్టార్స్ పబ్లిక్ అప్పియరెన్స్ ఇస్తుండడం ప్రస్తుతం ట్రెండ్ గా మారింది. ఒకరకంగా చూస్తే సినిమా స్టార్స్ కంటే వీళ్ళకే క్రేజ్ ఎక్కువగా ఉంటుంది. ఇక టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఈ ట్రెండ్ ని మరో లెవల్ కి తీసుకెళ్లింది. ఇప్పుడు మరో బ్యాడ్మింటన్ క్వీన్ పి.వి.సింధు సానియా ని ఫాలో అవుతుందని తెలుస్తోంది. ప్రఖ్యాత ఫెమీనా మ్యాగజైన్ 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా లేటెస్ట్ కవర్ పేజీపై దీపిక-పి.వి.సింధు-కిరణ్ మజుందార్ షా ఫోటోషూట్ ని ప్రింట్ చేశారు. ఈ కవర్ పేజీ ఎంతో స్పెషల్ గా ఎలివేట్ అవడం విశేషం.

ప్రత్యేక కవర్ ఎడిషన్ కాబట్టి.. విభిన్న రంగాలకు చెందిన ఓ ముగ్గురిని ఎంపిక చేసి ఈ ఫోటోషూట్ చేశారు. దీపిక పదుకొనే- పి.వి.సింధు- కిరణ్ మజుందార్ షా ఈ ముగ్గురూ తాము ఎంచుకున్న రంగాల్లో గొప్ప స్థాయికి చేరినవారు. అందుకే ఫెమినా తన 60 సంవత్సరాల వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా ఆ ముగ్గురి ముఖచిత్రంతో స్పెషల్ ఇష్యూ కవర్ ని డిజైన్ చేసింది. ఈ ముగ్గురూ సంథింగ్ స్పెషల్ అని చెప్పక తప్పదు. దీపిక ఎంతో సింపుల్ గా అందంగా బ్రౌన్ కలర్ దుస్తుల్లో కనిపిస్తుంది. మిగతా ఇద్దరు బ్రౌన్ షేడ్ డ్రెస్ లు ధరించారు. పి.వి.సింధు సంథింగ్ స్పెషల్ గా గ్లామరస్ గానూ కనిపిస్తోంది. ఇంకా చెప్పాలంటే దీపికను మించి కనిపిస్తోంది. ఇలాంటి  ఫోటోషూట్స్ దీపిక కు కొత్త కాదు.. కానీ పి.వి.సింధుకి మాత్రం కొత్తే. 

ఇక దీపిక నటించిన 'ఛపాక్' సినిమా 10 జనవరి 2020 న విడుదల కానుంది. యాసిడ్ దాడి బాధితుడు లక్ష్మి అగర్వాల్ నిజ జీవిత కథతో ఈ సినిమా తెరకెక్కుతుంది. కపిల్ దేవ్ బయోపిక్ '83' లోను తన భర్త రణవీర్ సింగ్ తో కలిసి నటిస్తుంది. ఈ సినిమా 2020 ఏప్రిల్ 10 న విడుదల కానుంది. అలాగే  పి.వి.సింధు బయోపిక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ విలన్ సోనూసూద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: