స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం "అల వైకుంఠపురములో" సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు. త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలోని ఒక పాట విడుదలై యూట్యూబ్ లో రికార్డ్ వ్యూస్ సంపాదించింది. ఈ ఒక్క పాటతో ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. సంక్రాంతి కానుకగా వస్తున్న ఈ సినిమా శరవేగంగా షూటింజ్ జరుపుకుంటుంది. అయితే ఈ సినిమా తర్వాత బన్నీ చేయాల్సిన సినిమాలు రెండు ఉన్నాయి.


వేణు శ్రీరామ్ దర్శకత్వంలో "ఐకాన్" చిత్రంతో పాటు, సుకుమార్ దర్శకత్వంలో మరో సినిమా ఉండనుంది. అయితే సుకుమార్ కథకి ఓకే చెప్పి, దసరా తర్వాత లాంఛనంగా ప్రారంభించి నవంబరు నుండి షూటింగ్ వెళ్ళాలని అనుకున్నారట. కానీ బన్నీ ప్రస్తుతం ఈ సినిమాని ఇప్పుడే స్టార్ట్ చేసేలా కనబడట్లేదు. అయితే సుకుమార్ మాత్రం బన్నీ కోసం తెగ తిరుగుతున్నాడట. కానీ బన్నీ మాత్రం "ఐకాన్" సినిమా చర్చలకోసం చూస్తున్నాడట.


అయితే అల వైకుంఠపురములో సెట్స్ లో సుకుమార్ తరచుగా కనిపిస్తున్నారట. షాట్ గ్యాప్ లో తన స్క్రిప్ట్ గురించి బన్నీకి వినిపిస్తున్నాడట సుకుమార్. సుకుమార్ సినిమా రంగస్థలం వచ్చి చాలా రోజులు అవుతుంది. దీంతో సుకుమార్ తన ప్రాజెక్ట్ తొందరగా పట్టాలెక్కాలని ప్రయత్నిస్తున్నాడట. మరోవైపు దిల్‌ రాజు కూడా అల్లు అర్జున్‌ని తరచుగా కలుస్తూనే వున్నాడట. సుకుమార్‌ సినిమా ఆలస్యమవుతుందనుకుంటే డిసెంబర్‌లోనే ఐకాన్‌ మొదలు పెట్టేయాలని చూస్తున్నాడట.


ఒకవేళ ఐకాన్ గనక ముందే స్టార్ట్ అయితే మరో ఆరు నెలలు ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. మరి అప్పటి వరకు  సుకుమార్ వెయిట్ చేస్తాడా? లేదా ఆ గ్యాప్ లో మరో సినిమా చేస్తాడా అనేది ఆసక్తిగా ఉంది. రెండు సినిమాల్లో బన్నీ ఏ సినిమాని ముందు చేస్తాడా అని అటు నిర్మాతలతో పాటు అభిమానులు కూడా ఎదురుచూస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: