Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Thu, Oct 17, 2019 | Last Updated 3:33 pm IST

Menu &Sections

Search

సైరా నరసింహారెడ్డి సినిమా పై స్పందించిన సిరివెన్నెల సీతారామశాస్త్రి

సైరా నరసింహారెడ్డి సినిమా పై స్పందించిన సిరివెన్నెల సీతారామశాస్త్రి
సైరా నరసింహారెడ్డి సినిమా పై స్పందించిన సిరివెన్నెల సీతారామశాస్త్రి
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
మెగాస్టార్ చిరంజీవి నటించిన భారతదేశ చారిత్రాత్మక చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్‌పై రామ్ చరణ్ నిర్మించిన ఈ సినిమా అక్టోబర్ 2 వ తేదీన గాంధీ జయంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ప్రపంచవ్యాప్తంగా ఐదు భాషల్లో విడుదలైన ‘సైరా నరసింహారెడ్డి’ దేశ వ్యాప్తంగా ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందుతూ ఘన విజయం సాధించింది. ఇప్పుడు ఈ సందర్భంగా చిత్ర యూనిట్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి తమ సినిమా చిత్రీకరణ అనుభవాలను పంచుకున్నారు.
 
అయితే ఈ సందర్భంగా ప్రముఖ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మాట్లాడుతూ శరన్నవరాత్రుల సందర్భంగా ‘సైరా’ సినిమా విడుదల కావడం కాకతాళీయం కాదు దానికి కూడా ఒక దైవీయకమైన విషయం ఉంది. విజయదశమి ఎందుకు చేసుకుంటారో మనందరికీ తెలుసు. సహించడానికి వీల్లేనంతగా ఆగడాలు ఎక్కువైపోయిన దుష్టశక్తిని సంహరించడానికి జగన్మాతకు తొమ్మిది రోజుల సమయం పట్టింది అలాగే అనేక రూపాల అవసరం వచ్చింది. రాక్షసుడైన మహిశాసురుడిని చంపి ఆ దసరా దశమినాడు జగన్మాత సాధించిన విజయం ఎలాంటిదో ఈ సైరా సినిమా సాధించిన విజయం అలాంటిది. ఎక్కడో ఒక పాలెగాడుగా ఉన్న వ్యక్తి తనకు జరిగిన వ్యక్తిగత అవమానాన్ని కాకుండా జాతిమీద జరుగుతున్న అత్యాచారాలుగా భావించి దానికోసం ఒక్కొక్క దివ్వెనూ వెలిగించినట్టుగా "నువ్వే లక్షలై.. ఒకే లక్ష్యమై" అన్నట్లు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బ్రిటీషువారిని ఎదిరించి పోరాడారు అని అయన తెలిపారు. 


ఇది ఒక చారిత్రాత్మకమైన దైవీయమైన ఘటన కాబట్టి దసరా నవరాత్రుల్లో విడుదలైంది అయన తెలియ చేశారు. ఈ సినిమాకు అఖండమైన విజయం అందించిన చిరంజీవిగారి అభిమానులను ప్రత్యేకంగా అభినందిస్తున్నాఅని చిరు అభిమానులను పొగిడారు. చిరంజీవి గారు ఆటపాటలతో అలరించడం అన్నది కొత్త విషయం అనేది కాదు. అయితే ఆయనకే సాధ్యమైన రీతిలో ముప్ఫై ఏళ్లుగా అలరిస్తున్నారు.


అది కాకుండా సమాజహితం కోరుకుని రక్తదానం, నేత్రదానం వంటి ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తున్న వ్యక్తి ఎనిమిది ఏళ్లు గ్యాప్ తీసుకున్న తర్వాత మళ్లీ తాను ఏం చేయగలరో ఈ సినిమా ద్వారా చిరంజీవిగారు నిరూపించారు అని అన్నారు. చిరంజీవి అంటే డ్యాన్స్, ఫైట్స్ ఇలా అన్ని  ఆయన నుంచి అభిమానులు ఇవే కోరుకుంటారు. కానీ సైరా చిత్రంలో చిరంజీవి సర్కస్ ఫీట్లు లాంటివి ఏమీ ఉండవు. ఆటపాటలతో అలరించే సినిమాలే కాకుండా దేశభక్తిని పెంపొందించే సినిమాలను కూడా తన అభిమానులు ఆదరిస్తారని ఆయన చెప్పిన మాట ఆయన అభిమానుల మీద ఆయనకున్న నమ్మకాన్ని తెలుపుతుంది. ఈ విజయం ఆయన అభిమానుల్లో ఉన్న అభిరుచిని కూడా చాటి చెబుతారని అయన తెలిపారు.


Sirivannela Sitharamastrakir, who responded to the film Saira Narasimhareddy
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
పవన్ రీ ఎంట్రీ బాధ్యత....ఎ.ఎం ర‌త్నానిదే
సమ్మెకు సిద్ధం అవుతున్న ఓలా, ఊబర్ డ్రైవర్లు
ఆట ఆల‌స్యం చేసార‌ని సినిమాహాల్‌పై పోలీస్ కేసు....పెట్టిన గోపిచంద్ ఫాన్స్
కీర్తి సురేష్ ఏంటి సినిమా కోసం ఇలా తయారుఅయింది ???
మంచి రోజులు వచ్చాయి అంటున్న శ్వేతాబసు
కమర్షియల్‌గా సక్సెస్‌ లేని..బెల్లం కొండ బాబుకు 10 కోట్లంట.!
ఆ ఛానల్ కి ఎందుకంత తొందర?
ఇష్టం వ‌చ్చిన‌ట్టు వాగేస్తారా? చ‌ర్య‌లు తీసుకుంటాన‌ని శృతి హెచ్చ‌రిక‌...ఎవరికి ఇచ్చింది ?
బాలయ్య బాబు సినిమానే గెలికిన జెమినీ టీవీ
ముందు కేశవానంద భారతి కేసు ఆ తరువాతే రామ జన్మభూమి
ఇంతలా అందరి చుట్టూ తిరగాల్సిన అవసరం ఏంటి? మెగాస్టార్ కు ఏమైంది?
వైద్యుల నిర్లక్ష్యంతో నిండు గర్భిణీ మృతి ??
రాయల్ సోఫాపై సోఫీ చౌదరి...రాకింగ్ పోజు..!
రస్మిక కు లేనివి పూజాహెగ్డే కి ఉన్నాయా
ఉత్తర కొరియా రాజుకు మళ్ళీ పురుగు తొలిచింది.....!
ముద్దు పెట్టి కోర్టుకెక్కిన మాజీ క్రీడా కారుడు...
చేతక్ తో మరో నూతన చరిత్రకు నాంది పలకనున్న బజాజ్....
కొంపలు ముంచనున్న మద్యం టెండర్లు...
ప్రమోషన్స్ తో దడ దడ పుట్టిస్తున్న ప్రధాని...
రాజ్యసభలో క్రమంగా పెరుగుతున్న ఎన్డీఏ బలం
కాజల్ కాబోయేవాడు అందగాడుగా,ఆజానుబాహుడు కానక్కర్లేదట!!
బాహుబలి ని నమ్మి మోసపోతున్న తెలుగు సినిమాలు
మద్యం దుకాణాల లైసెన్స్‌ దరఖాస్తులపైనే 907కోట్లు ఆదాయం
బిగ్‌బాస్‌ 3 విన్నర్ కంఫర్మ్ అయ్యాడా ??? విన్నర్ అతనేనా ??
ఆలియాభ‌ట్ కి లైఫ్ ఇవ్వనున్న బన్సాలి
తన కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు తెలియచేసిన మాజీ కెప్టెన్
గీతాఆర్ట్స్‌ ని అల్లుఅర్జున్‌ ఇచ్చేసారు ???
బాలీవుడ్ కొత్త సినిమాకి వింత ప్రమోషన్స్
హాలీవుడ్ ట్రైలర్ విడుదలచేసిన టాలీవుడ్ హీరో
నేడు హుజూర్​నగర్ ప్రచారంలో కేసీఆర్ బహిరంగ సభ
క్యాస్టింగ్ కౌచ్‌పై నిర్మాత తమ్మారెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు
అయ్యోద్య తీర్పు పై మరింత ఉత్కంఠ!!
మహేష్ బాబు ట్రైలర్ ... కామెడీ సూపర్ ఉంది
ఆ హీరోయిన్ నైట్ డ్రెస్ వేసుకొని ఓ గంట రమన్నారు అన్న హీరో నిఖిల్
వాదనలు ముగిసాయి ఇక తీర్పే ఆలస్యం
అధిక చార్జీలతో బెంబేలెత్తుతున్న ప్రయాణికులు
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.