తెలుగు సినిమా పరిశ్రమలో గత కొంత కాలంగా పలు వివాదాలు హాట్ టాపిక్ గా మారుతున్నాయి.తాజాగా సైరా విషయంలో కూడా తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడిన టాపిఖ్ పలు వివాదాలకు మూలకారణమైంది.ఇకపోతే సైరా కలెక్షన్ల గురించి ఇటీవల ఆయన విడుదల చేసిన వీడియోపై మెగా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. దానిపై క్లారటీ ఇస్తూ తమ్మారెడ్డి భరద్వాజ మరో వీడియో విడుదల చేసారు.


నేను వారం రోజుల క్రితం ‘సైరా’ చిత్రం కోసం ఒక పోస్ట్ పెట్టా..అది నేను సైరా రిలీజ్‌కి ముందు వీడియో చేశా. దాన్ని తప్పుగా అర్ధం చేసుకున్నారు. కలెక్షన్ల విషయంలో నేను ఏదో తప్పుగా మాట్లాడినట్టుగా నెగిటివ్ పోస్ట్‌లు పెట్టారు. నేను మాట్లాడిన దాంట్లో తప్పేం ఉందో నాకు అర్ధం కాలేదు. ఆదివారాని ముందే సైరా రూ. 300 కోట్లు వసూలు చేస్తుందని చెప్పా. ఒక్క బాహుబలి తప్ప వీకెండ్ ముందు ఏ సినిమా రూ. 300 కోట్లు వసూలు చేసింది లేదు. హిందీలో కూడా లేదు. అయితే సైరా ఆ రికార్డుల్ని బ్రేక్ చేస్తుందని చెప్తే దాంట్లో నేను తప్పుగా మాట్లాడానని ఏవేవో అర్దాలు తీస్తూ అనవసరంగా రాద్దాంతం చేస్తున్నారు.


ఇకపోతే నేను యూట్యూబ్‌‌లో డబ్బుల కోసమే వీడియోలు పెడుతున్నానని కూడా కొందరు అంటున్నారు. అదే నిజం అయితే చిరంజీవిని తిడితేనే ఎక్కువ వ్యూస్ వస్తాయి. నేను అలా చేయలేదు. చిరంజీవి పొగిడా.. ఆయన సినిమాకి మంచి కలెక్షన్లు వస్తాయనే అన్నా. ఈ మాటను నెగిటివ్‌గా ఆలోచించి ఇష్టం ఉన్నట్లుగా మాట్లాడుతున్నారు. దయచేసి ఇలాంటి  పిచ్చి పిచ్చి కామెంట్స్ చేయొద్దు. ఇక నాకు వయసు అయిపోయింది. ఈ విషయంలో మీ కర్మ అని వదిలేస్తున్నా. కాబట్టి దీనిపై నేను స్పందించాల్సిన అవసరం లేదు అంటూ తనని ద్వేషించే వాళ్లకు క్లారిటీ ఇచ్చారు తమ్మారెడ్డి...

మరింత సమాచారం తెలుసుకోండి: