మెగాస్టార్ చిరంజీవి ప్రెస్టీజియాస్ మూవీ 'సైరా నరసింహ రెడ్డి'. ఇప్పటివరకు చిరు కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించిన సినిమా. దాదాపు మెగాస్టార్ 20 ఏళ్ళ కల. ఆ కలను నిజం చేసుకుంటు.. మెగాస్టార్ సినిమా కెరీర్ లో ఒక వెలితిగా మిగిలిపోయో గొప్ప సినిమాని చేసి తన సినీ  జీవితాన్ని పరిపూర్ణం చేసుకున్నారు చిరు. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, సుదీప్, విజయ్ సేతుపతి, నయనతార, తమన్న..వంటి భారీ స్టార్ కాస్ట్ తో దాదాపు 300 కోట్ల బడ్జెట్ తో కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ నిర్మించిన అత్యంత భారీ సినిమా సైరా నరసింహా రెడ్డి కి... స్టార్ రైటర్స్ పరుచూరి బ్రదర్స్ తో పాటు దర్శకుడు సురేందర్ రెడ్డి చాలానే రీ సెర్చ్ చేశారు. ఇక రిలీజయ్యాక సినిమా బ్లాక్ బస్టర్ అన్న మాట అయితే వినిపించింది గాని కలెక్షన్స్ మాత్రం కనపడటం లేదు. కనీసం బ్రేక్ ఈవెన్ కి దరిదాపుల్లో కూడా లేదని తెలుస్తోంది. 

టాలీవుడ్ సినిమాలకు ఓవర్సీస్ మార్కెట్ పెద్ద అడ్వాంటేజ్ అని ఇంతకముందు అనుకునేవారు. ఇక యూఎస్ డిస్ట్రిబ్యూటర్లు కూడా స్టార్ హీరోల సినిమాల హక్కులను పోటీపడి సొంతం చేసుకునేవారు. కానీ ఈమధ్యకాలంలో అమెరికా డిస్ట్రిబ్యూటర్లకు టాలీవుడ్ సినిమాలు నిద్రలేని రాత్రులను మిగిల్చడమే కాదు అప్పుల ఊబిలోకి లాగేస్తున్నాయి. ఈ ఏడాదిలో ఎన్నో సినిమాలు రిలీజ్ అయ్యాయి కానీ యూఎస్ డిస్ట్రిబ్యూటర్లకు నిజంగా లాభాలు తీసుకొచ్చిన సినిమాలను వేళ్ళ మీద లెక్కపెట్టొచ్చు. 95% పైగా సినిమాలు డిస్ట్రిబ్యూటర్లకు నష్టాలే మిగిలిస్తున్నాయి. తాజాగా మెగాస్టార్ చిరంజీవి 'సైరా' సినిమా కూడా అదే లిస్టులో చేరేలా ఉందని ట్రేడ్ వర్గాల సమాచారం.

సైరా' ను 3.3 మిలియన్ డాలర్లకు అమ్మితే ఇప్పటివరకూ వసూలయింది 2.2 మిలియన్ మాత్రమేనని తాజా సమాచారం. లాభాల సంగతి పక్కన పెడితే బ్రేక్ ఈవెన్ మార్క్ చేరేందుకు ఇంకా 1.1 మిలియన్ డాలర్లు వసూలు చేయాలి. అయితే ప్రస్తుతం ఉన్న కలెక్షన్స్ ట్రెండ్ ను బట్టి చూస్తే సాధ్యమేనా అని అనుమానాలు కలుగుతున్నాయి.  ఇప్పటికే వారం రోజుల థియేట్రికల్ రన్ కంప్లీటయింది గనక ఇంకా కలెక్షన్స్ పెరిగే అవకాశం ఏమాత్రం లేదని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నారు. అంతేకాదు సైరా కు యూఎస్ లో దాదాపు 1 మిలియన్ డాలర్ల నష్టం తప్పేలా లేదని అంచనా వేస్తున్నారు. ఇదే గనక జరిగితే ఇక ఈ సినిమా యూఎస్ కలెక్షన్స్ సంక్రాంతి సినిమాల బిజినెస్ పై ప్రభావం చూపించడం ఖాయమని చెప్పుకుంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: