దర్శకధీరుడు రాజమౌళి పుట్టిన రోజు నేడు. ఆయన పుట్టినప్పటికే తెలుగు సినిమా స్వర్ణయుగం దాటి మెల్లగా వేగం వైపు పరుగులు తీస్తున్న సందర్భం ఉంది. అప్పటికే సినిమాల్లో యాక్షన్ పార్ట్ పెరిగింది. సాంగ్స్ కి ప్రయారిటీ కూడా పెరిగింది. ఇక డ్రామా కంటే కనికట్టు చేసే మ్యాజిక్ కి మెల్లగా దర్శకుడు అడుగులు వేస్తున్న తరుణంలో పుట్టారు మన రాజమౌళి.


రాజమౌళి డైరెక్ష‌న్ డిపార్ట్మెంట్లో శిక్షణ తీసుకున్నది ద గ్రేట్ మాయాజల స్పెషలిస్ట్ కే రాఘవేంద్రరావు దగ్గర. ఆయన వద్ధ శిష్యరికం చేసి ఆడియన్స్ పల్స్ ఎలా పట్టుకోవాలో నేర్చుకున్నారు. ఇక తనకు అందుబాటులో ఉన్న సాంకేతిక సంపత్తిని ఆసరాగా చేసుకుని మగధీరుడు, ఈగ, బాహుబలి లాంటి బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టాడు. నిజంగా రాజమౌళిని గ్రేట్ అని మళ్ళీ మళ్ళీ అనాలి.


ఎందుకంటే ఓ చందమామ కధను ఖండాంతరాలకు తీసుకునిపోయి భళీ అనిపించిన గొప్పతనం ఆయనకు కాక మరెవరికి దక్కుతుంది. ఇక రాజమౌళి రికార్డులు ఎవరూ ఇప్పటికీ బద్దలుకొట్టలేకపోయారు అంటే మరో మారు రాజమౌళికి హాట్సాఫ్ చెప్పాలి. ఇక బాలీవుడ్ లో రాజమౌళి క్రియేట్ చేసిన రికార్డ్  ఇప్పటికి రెండేళ్ళు పై దాటినా ఇంకా సేఫ్ గానే ఉంది. హిందీలో కేవలం పది రోజుల్లో 300 కోట్ల రూపాయలు వసూల్ చేసిన మూవీ బాహుబలి.


ఇప్పట్లో ఈ రికార్డుని ఏ మూవీ కూడా బీటౌట్ చేయలేదని కూడా సినీ అనలిస్టులు  అంటున్నారంటే రాజమౌళి ది గ్రేట్ అనాల్సిందే. మరో వైపు వార్, సంజూ, టైగర్ జిందా హై, సుల్తాన్ వంటి టాప్ హిందీ మూవీస్ 200 కోట్ల క్లబ్ లో చేరాలంటే ఏడు రోజులు టైం తీసుకున్నాయి. ఇక దంగల్, పీకే మూవీస్ ఇదే రెండు వందల కోట్ల క్లబ్ లో చేరాలంటే ఎనిమిది రోజులు తీసుకున్నాయి. మరి భవిష్యత్తులో ఏ హిందీ సినిమా 10 రోజుల్లో 300 కోట్లు వసూల్ చేస్తుందో చూడాలి.


లేక ఆర్ ఆర్ ఆర్ మూవీ ద్వారా రాజమౌళి తన రికార్డులు తానే తిరగరాస్తారేమో కూడా చూడాలి. ఏది ఏమైనా తెలుగు తెర ఎందరో గొప్ప దర్శకులను ఇచ్చింది, వారి సరసన ఈ తరంలో చేరిన ఏకైన దర్శకుడు రాజమౌళి. ఆయన మరిన్ని పుట్టిన రోజులు జరుపుకోవాలని మనసారా అభిమానులంతా కోరుకుంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: