తెలుగులో వస్తున్న బిగ్ బాస్ షో దసరా పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి.  కింగ్ నాగార్జున్ బంగార్రాజు గెటప్ లో వచ్చి ఇంటి సభ్యులను ఉత్సాహపరిచారు.  అందరితో ఆటపాటలతో అలరించారు.   మంగళవారం నుంచి బిగ్ బాస్ హౌజ్ లో అందరితో ఫన్నీ టాస్క్ లు ఇస్తూ తెగ ఎంజాయ్ చేశారు.  నిన్నటి ఎపిసోడ్ లో ఇంటి సభ్యులతో భలే గేమ్స్ ఆడించారు నాగార్జున.   

ఈ నేపథ్యంలో వరుణ్ సందేశ్ తో ఫ్రూట్స్ తినిపిస్తూ అతడిపై సెటైర్లు వేశారు నాగార్జున.  ఆ తర్వాత అలీ రెజా కళ్లకు గంతలు కట్టి మహేష్ విట్టాకు మేకప్ వేయించాడు. ఇలా ఒక్కో ఇంటి సభ్యులకు వింత వింత టాస్క్ లు ఇచ్చి ఎంజాయ్ చేయించారు. ఇక శ్రీముఖి విషయంలో ఈ ఎంట్రటైన్ మెంట్ కాస్త ఎక్కువే అయ్యింది. మహేష్ చేయాల్సిన బెల్లి డ్యాన్స్ శ్రీముఖితో చేయించారు. 


వెన్నెల రాత్రికి..ఆ చంద్రుని వేడికి.. కావాలా కౌగిలి అనే పాటకు నాగార్జున ముందు శ్రీముఖి బెల్లి డ్యాన్స్ చేయడం చూసి ఇంటి సభ్యులు తెగ అల్లరి చేశారు. శ్రీముఖి బెల్లీ డ్యాన్స్ చూసిన ప్రేక్షకులు పొట్ట చెక్కలయ్యేలా నవ్వారు. తర్వాత ఇంటి సభ్యుల్లో ఎవరు పర్ఫెక్ట్ గా పనిచేస్తున్నారో వారిని ఎంచుకోమని వారికే చెప్పారు..తర్వాత వారికి సర్పైజ్ గిఫ్ట్ లు ఉంటాయని చెప్పారు.

ఈ ప్రాసెస్ లో శివజ్యోతికి, వరుణ్ కి రెండు స్టార్లు చొప్పున రావడంతో వారిద్దరికీ ఈ వారం మొత్తం స్పెషల్ గా డిన్నర్ ఉంటుందని బిగ్ బాస్ చెప్పారు.  అయితే వారికి వచ్చిన ఫుడ్ ఇంటి సభ్యులకు ఎవరికీ ఇవ్వొద్దని ఆర్డర్. మొత్తానికి కింగ్ నాగార్జున్ బంగార్రాజు గెటప్ లో వచ్చి ఇంటి సభ్యులను ఉత్సాహపరిచారు.


మరింత సమాచారం తెలుసుకోండి: