దసరా పండుగ ముగిసిన నేపధ్యంలో నిన్నటి రోజున ‘సైరా’ పరిస్థితి ఎలా ఉంటుంది అన్న ప్రశ్నలకు సమాధానాలు వచ్చాయి. తెలుగు రాష్ట్రాలలోని అనేక ప్రాంతాలకు చెందిన ‘సైరా’ ప్రదర్శింపబడుతున్న ధియేటర్లు చాల చోట్ల ప్రేక్షకులు లేక వెలవెల పోయిన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ వారం ‘సైరా’ కు పోటీ ఇవ్వగల ఏ సినిమా విడుదల లేనప్పటికీ ప్రేక్షకులను ‘సైరా’ వైపు రప్పించే మ్యానియా పెద్దగా పనిచేయక పోవడంతో రాబోతున్న వీకెండ్ తరువాత ‘సైరా’ కలక్షన్స్ పూర్తిగా ఖాళీ అయిపోయే పరిస్థితులు ఏర్పడినా ఆశ్చర్యయంలేదు అని అంటున్నారు. దీనితో ‘సైరా’ బయ్యర్లకు నష్టాల గుబులు బయలు దేరింది అన్నవార్తలు కూడ ఉన్నాయి.

ఇలాంటి పరిస్థితులలో ఒక షాక్ ఇచ్చే గాసిప్ ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాలలో హడావిడి చేస్తోంది. హల్ చల్ చేస్తున్న ఈ వార్తల ప్రకారం ‘సైరా’ ప్రాజెక్ట్ మొదలుపెట్టే ముందు ఈ ప్రాజెక్ట్ వద్దు అని అల్లు అరవింద్ చరణ్ కు అర్ధం అయ్యేలా చెప్పినట్లు టాక్. అంతేకాదు చరణ్ ఆశిస్తున్నట్లుగా ‘సైరా’ కు జాతీయ స్థాయిలో భారీ కలక్షన్స్ రావని తెలుగు రాష్ట్రాలలో మటుకు ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అయినప్పటికీ చరణ్ పెట్టే బడ్జెట్ కు వచ్చే కలక్షన్స్ సరిపోవు అని అంటూ ముందుగానే తన అనుభవంతో చరణ్ కు అరవింద్ సూచనలు ఇచ్చినట్లు తెలుస్తోంది. 

వాస్తవానికి చిరంజీవికి రాజకీయాలలోకి రాకముందే తాను ‘సైరా’ ను తీయాలని భావించిన విషయాలను చరణ్ కు వివరిస్తూ ‘సైరా’ కు పెట్టే పెట్టుబడితో చిరంజీవితోనే మరో రెండు మంచి సినిమాలు తీయవచ్చు అన్న ఆలోచనలు తనకు రావడంతో అప్పట్లోనే తాను ‘సైరా’ ఆలోచనలు వదులుకున్న విషయాలను అరవింద్ చరణ్ కు మొదట్లో చెప్పాడు అని అంటున్నారు. అయితే ‘బాహుబలి’ మ్యానియాతో ఉత్సాహం పొందిన చరణ్ చిరంజీవితో చేసిన ‘సైరా’ ప్రయత్నం మంచిదే అయినా చివరకు ఈ సినిమా బయ్యర్లకు నష్టాలు కలిగించింది అన్న అపవాదు రావడం ‘సైరా’ కు మైనస్ పాయింట్ గా మారింది అన్నకామెంట్స్ వినిపిస్తున్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: