టాలీవుడ్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఇటీవల హరీష్ శంకర్ దర్శకత్వంలో నటించిన మాస్ యాక్షన్ సినిమా గద్దలకొండ గణేష్ తో మంచి విజయాన్ని అందుకోవడంతో పాటు నటుడిగా ప్రేక్షకుల నుండి మాస్ ఇమేజ్ ని కూడా దక్కించుకోవడం జరిగింది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై నిర్మితం అయిన ఆ సినిమాలో వరుణ్ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటించగా మిక్కీ జె మేయర్ ఆ సినిమాకు సంగీతాన్ని అందించారు. 

ఇకపోతే దాని తరువాత వరుణ్ తదుపరి సినిమా నేడు లాంఛనంగా ప్రారంభం కాబోతోంది. అల్లు అరవింద్ సమర్పణలో ఆయన పెద్ద కుమారుడు అల్లు వెంకటేష్ ని తొలిసారి నిర్మాణ రంగంలో ప్రవేశ పెడుతున్నారు. యువ దర్శకుడు కిరణ్ కొర్రపాటి రచన మరియు దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాకు యువ సంగీత దర్శకుడు ఎస్ ఎస్ థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. జార్జ్ విలియమ్స్ ఫొటోగ్రాఫర్ గా పనిచేస్తున్న ఈ సినిమాకు మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ ని అందిస్తున్నారు. 

కెరీర్ పరంగా ఇప్పటివరకు మంచి సాఫ్ట్ లవ్ స్టోరీస్, కమర్షియల్ సినిమాలు, ప్రయోగాత్మక సినిమాలు, మాస్ సినిమాలు వంటివి చేసిన వరుణ్ తేజ్, కెరీర్ లో మొట్టమొదటి సారి స్పోర్ట్స్  బ్యాక్ డ్రాప్ మూవీలో నటిస్తుండడం విశేషం. ఇక ఈ సినిమాలో వరుణ్ ఒక యువ బాక్సర్ గా నటిస్తున్నారు. ఇటువంటి క్యారెక్టర్ తనకు ఎంతో థ్రిల్ ని ఇస్తుందని వరుణ్ అంటున్నారు, ఇక అందుకోసం ఆయన తన దేహాన్ని ఎంతో దృఢంగా తాయారు చేసేందుకు కసరత్తులు చేస్తున్నట్లు సమాచారం. ఇకపోతే ఈ సినిమాలో నటించే హీరోయిన్, మరియు ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు మాత్రం పూర్తిగా తెలియాల్సి ఉంది.. కాగా ఈ సినిమా ప్రారంభోత్సవానికి పలువురు సినిమా రంగ ప్రముఖులు హాజరు కానున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: