టాలీవుడ్ కి మాత్రమే పరిమితమైన తెలుగు సినిమాల క్రేజ్ ఒక్కసారిగా ప్రపంచం నలుమూలల పాకిపోయింది. ఇక టాలీవుడ్ డార్లింగ్ గా ఉన్న ప్రభాస్... వరల్డ్ వైడ్ డార్లింగ్ గా మారిపోయాడు. ప్రభాస్ సినిమా వస్తుందంటే అందరూ వెయ్యి కళ్ళతో ఎదురు చూసేంత క్రేజ్  సంపాదించాడు ప్రభాస్. ఇక దర్శక ధీరుడు రాజమౌళి పేరు ప్రఖ్యాతులను బాహుబలి సినిమా ప్రపంచం నలుమూలలా వ్యాప్తి చేసింది . వీటన్నిటికీ కారణం ఒక్కటే సెన్సేషనల్ మూవీ బాహుబలి... ప్రపంచవ్యాప్తంగా బాహుబలి రిలీజ్ అయి రికార్డులు సృష్టించింది. బాహుబలి  సృష్టించిన రికార్డులను  తర్వాత విడుదలైన బాహుబలి సీక్వెల్ బాహుబలి 2 తిరగరాసి మరో సరికొత్త రికార్డును సృష్టించింది. 

 

 

 

 

 

 దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి ముందు హాలీవుడ్ బాలీవుడ్ సినిమాలు కూడా నిలువ లేక పోయాయి. అన్ని  ఇండస్ట్రీలలో సరికొత్త రికార్డును సృష్టించింది బాహుబలి. కనీవినీ ఎరుగని రీతిలో వసూళ్లను రాబట్టి సంచలన విజయాలను అందుకుంది బాహుబలి సినిమా. ఒక్క బాహుబలి సినిమాతోనే తెలుగు చిత్ర పరిశ్రమ పేరు ప్రఖ్యాతలు ప్రపంచం నలుమూలలా మార్మోగి పోయాయి. సంచలన వసూళ్లు రాబట్టి బాక్సాఫీస్ దగ్గర అన్ని రికార్డులను తిరగరాసిన బాహుబలి సినిమా రికార్డులను ఇప్పుడు వరకు ఏ సినిమా కూడా బ్రేక్ చేయలేకపోయింది. ఇక హిందీలో బాలీవుడ్ అగ్ర హీరోల సినిమాలు వస్తున్నప్పటికీ బాహుబలి రికార్డు మాత్రం ఇంకా సేఫ్ గానే ఉంది. 

 

 

 

 

 

 బాహుబలి రికార్డు సృష్టించి రెండేళ్లు గడుస్తుంది... అయితే బాహుబలి తర్వాత బాలీవుడ్ అగ్ర హీరోల సినిమాలు వచ్చినప్పటికీ బాహుబలి రికార్డును మాత్రం టచ్ చేయలేకపోయాయి. దీంతో రెండేళ్లు గడిచినా కూడా బాహుబలి సృష్టించిన రికార్డు ఇంకా పదిలంగానే ఉంది. విడుదలైన మొదటి పది రోజుల్లోనే 300 కోట్లు వసూళ్లు రాబట్టిన మొదటి సినిమా బాలీవుడ్లో బాహుబలి2 సినిమా రికార్డు సృష్టించింది. అయితే బాహుబలి 2 రికార్డుని బ్రేక్ చేయడానికి ఏ సినిమా కూడా కనీసం పోటీ ఇవ్వలేకపోతున్నాయని ట్రేడ్ అనలిస్ట్ ఒకరు చెప్పారు. అయితే 200 కోట్ల క్లబ్ లో చేరడానికి దంగల్ పీకే వంటి సినిమాలకు 8 రోజులు టైం పెడితే... సంజు,  టైగర్ జిందా హై,  సుల్తాన్,  వార్  లాంటి సినిమాలకు 200 కోట్ల క్లబ్ లో చేరడానికి ఏడు రోజుల సమయం పట్టింది. దీన్ని బట్టి చూస్తే బాహుబలి2 రికార్డ్ ఇంకాసేపు అనే ఉన్నట్లు కనిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: