మెగాస్టార్ గా నెంబర్ వన్ హీరోగా టాలీవుడ్ లో తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తున్న చిరంజీవి సినిమాలు వదిలేసి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే సినిమాలకు భిన్నంగా రాజకీయాల్లో ఆయన ప్రస్థానం కొనసాగింది. దీంతో మళ్లీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి తొమ్మిదేళ్ల గ్యాప్ తర్వాత ఖైదీ నెం.150 సినిమాతో టాలీవుడ్ లోకి రీఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి ఘనమైన రీఎంట్రీ ఇచ్చారు. చాలా కాలానికి వచ్చిన చిరంజీవి సినిమా కాబట్టి కలెక్షన్లు వచ్చాయన్న వారికి సైరాతో ఆయన స్టామినా తెలుగు సినిమాల్లో ఏ స్థాయిలో ఉంటుందో చాటి చెప్పారు.

 


ఈ సినిమా కలెక్షన్లతో చిరంజీవి మరిన్ని భారీ సినిమాలు చేయడానికి అర్హత ఉందని నిరూపణ అయింది. పాన్ ఇండియా సబ్జెక్ట్ గా విడుదలైన ఈ సినిమా బాలీవుడ్ లో హిట్ కాలేదు. సినిమా బాగుందన్న టాక్ ఉన్నా కలెక్షన్లు లేవు. తమిళ్, మళయాళంలో ఓ మెస్తరుగా ఉన్నా కర్ణాటకలో మంచి కలెక్షన్లే రాబట్టింది. చిరంజీవి సరైన పాన్ ఇండియా సబ్జెక్ట్ చేస్తే భారీ విజయాలు సాధ్యమే అని ఇప్పుడు ఇండస్ట్రీలో, ట్రేడ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న మాట. చిరంజీవి సినిమా వస్తే చాలు కలెక్షన్లు వస్తాయి అని సైరా ప్రూవ్ చేసింది. వారం రోజుల్లోనే 100 కోట్లు షేర్ రాబట్టమంటే ఓ రికార్డే. కమర్షియల్ అంశాలు జోడించి మంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమా చేస్తే అద్భుతాలు ఖాయమే అని చిరంజీవి నిరూపించారు.

 


సీనియర్ హీరోగా ఖైదీ నెం.150, సైరాలను 100 కోట్ల షేర్ దాటించి వరుసగా రెండు సినిమాలను ఈ క్లబ్ లో చేర్చిన ఘనతను చిరంజీవి అందుకున్నారు. కాబట్టి చిరంజీవి ఇకపై పాన్ ఇండియా సబ్జెక్టులపై దృష్టి సారిస్తే మరిన్ని అద్భుతాలు ఖాయమే.

 


మరింత సమాచారం తెలుసుకోండి: