బాలయ్య, చిరుల మధ్య చిన్న గ్యాప్ ఉందనే మాటలు ఇండస్ట్రీలో వినిపిస్తుంటాయి. ఇప్పుడు ఆ సంగతి మరోసారి బయటపడింది. 'సైరా' సినిమా సక్సెస్ అయిన తరువాత చిరంజీవిని దర్శకుడు త్రివిక్రమ్ ఇంటర్వ్యూ చేశాడు. ఇందులో చిరు కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చాడు.
'సైరా' సినిమాను చూసిన నాగార్జున తనను కౌగిలించుకొని, ఎపిక్ సినిమా అన్నారని.. ఎంతో ఎమోష‌న్‌తో క‌ళ్ళంమ‌ట క‌న్నీరు కార్చార‌ని  ఆ తరువాత వెంకటేష్ ఇంటికి వచ్చి మరీ శుభాకాంక్షలు చెప్పి హగ్ చేసుకున్నారని..  ర‌జ‌నీకాంత్ ఫోన్ చేసి మెచ్చుకున్నారని.. వాళ్ల ఆవిడ లతగారు కూడా చాలా ఎమోషనల్ అయ్యారని చిరు చెప్పారు. వీళ్లే కాకుండా 'సైరా' గురించి మొత్తం ఇండస్ట్రీ స్పందించించార‌ని ఎంతో ఆనంద‌ప‌డ్డారు.


కానీ బాలకృష్ణ మాత్రం నోరు మెదపలేదు. ఇప్పటివరకు చిన్న రియాక్షన్ కూడా ఇవ్వలేదు. బాలయ్య స్పందించే అవకాశం లేదని వారి గురించి తెలిసినవాళ్లు చెబుతున్నారు. ఈ ర‌కంగా అనుకుంటే గ‌తంలో ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు చిత్రం టైంలో బాల‌య్య‌కు కూడా చిరంజీవి ఎటువంటి స్పంద‌న రాలేదు. మ‌రి వీరిద్ద‌రి మ‌ధ్య ఉన్న విభేదాలు ఏంటి అన్న‌ది తెలియాలి. 


చిరంజీవి నటిస్తున్న ‘సైరా నర్సింహారెడ్డి’ సినిమా విడుదలకు సిద్ధమవుతుంది. అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా ఈ సినిమాను విడుదల చేయనున్నారు. అయితే అమెరికాలో మాత్రం‘సైరా’ అక్టోబర్ 1వ తేదీనే రిలీజ్ కానుంది. దీంతో ఆ రోజు మెగా అభిమానులకు యూఎస్ డిస్ట్రిబ్యూటర్లు అదిరిపోయే ఆఫర్ ఇస్తున్నారు. ఒక టికెట్ కొంటే మరో టికెట్‌ను ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించారు.


అయితే దీనికి ఓ కారణం కూడా ఉందండి. అక్టోబర్ 2 గాంధీ జయంతి.. భారతీయులందరికీ సెలవు. కాబట్టి సినిమా విడుదలకు ఎలాంటి ఢోకా లేదు. కానీ...  ఎవరికి సెలవులు ఉండవు. దీంతోఅందరూ ఉద్యోగాలకు వెళ్లే రోజు. ఆ రోజున ఎవరూ సినిమాలు చూసేందుకు ఇష్టపడరు. అందుకే అమెరికాలో పలు సంస్థలు మంగళవారం నాడు సినిమా ప్రేక్షకులకు ప్రత్యేక ఆఫర్లను అందిస్తుంటాయి. అందులో భాగంగానే 'సైరా'కు కూడా ఆఫర్ వచ్చింది.  అమెరికాలో ఏటీ అండ్ టీ సంస్థ 'సైరా' టికెట్లను ఆన్ లైన్లో విక్రయిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: