టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, బాలనటుడిగా చిన్నతంలోనే సినిమాల్లోకి ప్రవేశించడం జరిగింది. తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ గారి ప్రోద్బలంతో మొదట సినిమా రంగంలోకి ప్రవేశించిన మహేష్, చిన్న వయసులోనే తన ఆకట్టుకునే నటనతో ఫ్యాన్స్ ని మెప్పించారు. ఆ తరువాత పెరిగి పెద్దయ్యాక రాజకుమారుడు అనే సినిమాతో హీరోగా మారిన మహేష్ బాబు, అక్కడినుండి కెరీర్ పరంగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని, నేడు టాలీవుడ్ నెంబర్ వన్ హీరోల్లో ఒకరిగా ఎదిగారు. ఇక ఎంత ఎదిగినా తండ్రి కృష్ణ గారివలె ఒదిగి ఉండే మహేష్ బాబు, 

ఎప్పటికీ తనకు తన తండ్రి కృష్ణ గారికి రుణపడి ఉంటానని చెప్తుంటారు. ఇక ఇటీవల వోగ్ పత్రికకు ఇచ్చిన లేటెస్ట్ ఇంటర్వ్యూ లో మహేష్ బాబు కొన్ని సంచలన నిజాలు వెల్లడించారు. నిజానికి చిన్నపుడు తన స్కూల్ కి వేసవి సెలవుల సమయంలో సరదాగా సినిమాల్లో నటించేవాడినని, అలానే తండ్రి కృష్ణ గారు కూడా తనను ఎంతో ప్రోత్సహించేవారని అన్నారు మహేష్. ఇక ఆ తరువాత వరుసగా సినిమాలు చేస్తూ ఉండడంతో, మెల్లగా సినిమాలపై మరింత ఆసక్తి పెరిగిందని, అదే తనను టాలీవుడ్ కి హీరోగా మారేలా చేసిందని అన్నారు. 

ఇక నేడు తనకు దక్కిన ఈ సూపర్ స్టార్ హోదాకు కారకులు తన తండ్రి కృష్ణ గారేనని, ఆయన వల్లనే తనకు ఇంతటి గొప్ప పేరు ప్రఖ్యాతలు రావడం జరిగిందని మహేష్ అన్నారు. మొదటి నుండి కృష్ణ గారి సినిమాలే ఎక్కువగా చూసి పెరిగిన తనకు, తండ్రి కృష్ణ గారే సూపర్ హీరో అని అన్నారు మహేష్. ఇక ఎక్కువగా తనకు తీరిక సమయంలో సరదాగా గడపడం అలవాటని చెప్పిన సూపర్ స్టార్, ఎవరికైనా తన ఫ్యామిలీతో సరదాగా గడపడాన్ని మించిన ఎంజాయిమెంట్ ఏముంటుందని అన్నారు. ఇక ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో సరిలేరు నీకెవ్వరు సినిమాలో హీరోగా నటిస్తున్నారు మహేష్. కాగా ఆ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.....!!  


మరింత సమాచారం తెలుసుకోండి: