మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన హీరోల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ తెచ్చుకున్నాడు వరుణ్ తేజ్. గద్దలకొండ గణేష్ సినిమా తో అతను ఎలాంటి రోల్ అయినా చేయగలడు అని ప్రూవ్ చేసుకున్నాడు. అంతేకాదు ఆ సినిమాతో మెగా ప్రిన్స్ అనే స్క్రీన్ నేమ్ కూడా వచ్చేసింది. గద్దలకొండ గణేష్ హిట్ జోష్ లో ఉన్న వరుణ్ ఏమాత్రం లేట్ చేయకుండా తన తర్వాత సినిమా షురూ చేశాడు. 

 

కిరణ్ కొర్రపాటి అనే కొత్త దర్శకుడి డైరెక్షన్ లో వరుణ్ నెక్స్ట్ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ ముహూర్తం ఈరోజు జరిగింది. ముహూర్తం రోజే సినిమా ప్రీ లుక్ ఒకటి రిలీజ్ చేశారు చిత్రయూనిట్. బాక్సింగ్ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమా ప్రీ లుక్ లో కూడా అదే చూపించారు. కొత్త దర్శకుడే అయిన కిరణ్ చెప్పిన కథకు వరుణ్ ఫిదా అయినట్టు తెలుస్తుంది. అందుకే సినిమా ఓకే చేశాడు. ఈ సినిమా కోసం వరుణ్ బాక్సింగ్ కూడా నేర్చుకున్నాడు. 

 

ఫిదా తో కమర్షియల్ సక్సెస్ అందుకున్న వరుణ్ ప్రస్తుతం వరుసగా హిట్లు కొడుతున్నాడు. ఈ ఇయర్ ఆల్రెడీ f-2 హిట్ అందుకున్న వరుణ్ తేజ్ గద్దలకొండ గణేష్ తో మరో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. చూస్తుంటే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ చరణ్, బన్నీల సరసన స్టార్ హీరోగా నిలిచేలా ఉన్నాడు.  

 

తెలుగులో బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ తో వచ్చిన అన్ని సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి.  మరి వరుణ్ తేజ్ కు ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి. ఈ మూవీ లో హీరోయిన్ మిగతా కాస్ట్ అండ్ క్రూ ఎవరన్నది ఇంకా తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: