టాలీవుడ్ లో హీరోయిన్ గా జీవిత విభిన్నమైన పాత్రలను పోషించారు. తలంబ్రాలు, అంకుశం, ఆహుతి లాంటి సినిమాల్లో నటించిన ఆమె తన సహనటుడు డాక్టర్ రాజశేఖర్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. హీరోయిన్ గా పలు సినిమాల్లో నటించిన జీవిత తర్వాత నిర్మాత, దర్శకురాలిగా తన సత్తా చాటారు. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.


మా సొంత ఊరు ద్రాక్షారామం.. మా అమ్మగారిది విజయవాడ. ఈ నేపథ్యంలో నాకు రాజమంత్రి, కాకినాడ పరిసర ప్రాంతాలతో ఎక్కువగా అనుబంధం ఉంది. సినిమాల్లోకి రాక ముందు నా అసలు పేరు పద్మ.  ప్రముఖ నటులు, నిర్మాత, దర్శకులు టి.రాజేందర్ నన్ను తమిళ చిత్ర పరిశ్రమకు పరిచయం చేశారు. ప్రముఖ నటి జయచిత్ర సోదరుడు నా మొదటి మూవీ హీరో.  తమిళంలో ఆ మూవీ మంచి సక్సెస్ సాధించింది. 


 దాంతో నా పేరు పద్మ కాకుండా జీవిత అని మార్చారు దర్శకులు టి. రాజేందర్. అయితే ఆ పేరు నాకు బాగా కలిసి వచ్చింది..ఆ పేరు తోనే నేను తెలుగు లో పాపులర్ అయ్యాను. రాజశేఖర్ తో తనకి గల తొలి పరిచయాన్ని గురించి ప్రస్తావించారు.  తెలుగు సినిమా 'తలంబ్రాలు' కోసం ఎమ్మెస్ రెడ్డిగారు నన్ను తీసుకున్నారు. ఈ సినిమాలో విలన్ గా రాజశేఖర్ నటించారు. ఆ తర్వాత అంకుశం, ఆహుతి సినిమాల్లో మేం కలిసి నటించాం. అలా మా పరిచయం ప్రేమగా మారి పెద్దలను ఒప్పటించి పెళ్లి చేసుకున్నామని అన్నారు జీవిత.


మరింత సమాచారం తెలుసుకోండి: