నందమూరి అందగాడు బాలక్రిష్ణ వరసగా సినిమాలు  చేసుకుంటూ పోతున్నాడు. సీనియర్ మోస్ట్ హీరో అయినా కూడా ఆయన ఎనెర్జీ లెవెల్స్ ఎక్కడా తగ్గలేదు. ఈ ఏడాది ఇప్పటికే కధానాయకుడు, మహానాయకుడు సినిమాలు రిలీజ్ చేసిన బాలయ్య ఇదే ఏడాది చివర్లో రూలర్ మూవీని థియేటర్లకు తెస్తున్నాడు. ఈ మూవీని డిసెంబర్ 20న అనుకుంటున్నారు. జూన్ లో ప్రారంభమైన   ఈ మూవీకి సంబంధించి షూటింగ్ దాదాపుగా పూర్తి కావచ్చిందంట. అంటే. బాలయ్య ఎంత స్పీడ్ గా మూవీస్ చేస్తాడో అర్ధం చేసుకోవాలి.


ఇదిలా ఉండగా ఈ మూవీ తరువాత సినిమా 106 ని కూడా బాలయ్య లైన్లో పెట్టాడు, ఈ మూవీని టాప్ డైరెక్టర్ బోయపాటి శ్రీను డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ మూవీతో బాలయ్య బోయపాటి హ్యాట్రిక్ సక్సెస్ కొట్టాలనుకుంటున్నారు. ఈ మూవీలో రెండు క్యారక్టర్లు ఉంటాయట. ఒకటి యంగ్ క్యారక్టర్ దాని కోసం బాలయ్య ఇప్పటికే బాగా తగ్గి స్లిమ్  గా తయారయ్యాడు. 


ఇక యంగ్ క్యారక్టర్ పక్కన మిల్కీ బ్యూటీ తమన్నాని తీసుకోవాలనుకుంటున్నట్లుగా టాక్ నడుస్తోంది. ఈ మూవీలో మరో ఇద్దరు హీరోయిన్లు కూడా ఉంటారని అంటున్నారు. మొత్తానిక్ గ్లామర్ తో ఫుల్ గా ఈ మూవీని నింపేయాలన్నది బోయపాటి మార్క్ ఆలోచనగా కనిపిస్తోంది. ఇక ఈ మూవీలో తమన్నా బాలయ్యతో జత కడుతోందన్న వార్తలు ఫ్యాన్స్ కి ఖుషీ చేస్తున్నాయి.


ఇప్పటికే తమన్నా ఎఫ్ 2లో వెంకీ పక్కన నటించింది. తాజాగా రిలీజ్ అయిన సైరా మూవీలో మెగాస్టార్ పక్కన కూడా నటించింది. ఇక కొరటాల మెగాస్టార్ మూవీలో కూడా తమన్నా ఓ హీరోయిన్ అని అనుకుంటున్నారు. ఇపుడు బాలయ్యతో నటించడం ఖరారు అయితే ఒక్క నాగార్జున తప్పసీనియర్ హీరోలందరి సరసనా నటించిన క్రెడిట్ తమన్నా సొంతం అవుతుంది. మరి నాగ్ తో సైతం తమన్నా నటించేందుకు రెడీగా ఉందని అంటున్నారు. ఆ విధంగా చూస్తే అటు యంగర్ జనరేషన్, ఇటు సీనియర్ హీరోల  పక్కన మెరిసిన తారగా తమన్నా రికార్డు స్రుష్టించినట్లేమరి.



మరింత సమాచారం తెలుసుకోండి: