బిగ్ బాస్ తెలుగులో ఇప్పటికే రెండు సీజన్లు సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకొని ప్రస్తుతం మూడవ సీజన్ స్టార్ మా ఛానెళ్లో టెలికాస్ట్ అవుతోంది. అక్కినేని నాగార్జున ఈ షోకు హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటికే 11 వారాలు పూర్తి చేసుకున్న ఈ షో 12 వారం ఎలిమినేషన్ కు నామినేట్ అయిన వారిలో మహేశ్ విట్టా,
రాహుల్ సిప్లిగంజ్,
వరుణ్ సందేశ్ ఉన్నారు. గత ఆదివారం బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయిన పునర్నవి బయటకు వచ్చాక మీడియా ఛానెళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తోంది.
బిగ్ బాస్ హౌస్ లో
రాహుల్ పునర్నవి పై చాలా గాసిప్స్ వచ్చాయి. రాహుల్, పునర్నవి మధ్య లవ్ ట్రాక్ నడుస్తుందని వార్తలు వినిపించాయి. ఈ లవ్ ట్రాక్ వలనే ఇంతకాలం రాహుల్, పునర్నవి ఎలిమినేషన్ కు నామినేట్ అయినా సేఫ్ అవుతూ వచ్చారని వార్తలు వినిపించాయి. పునర్నవి ఎలిమినేట్ అయిన సమయంలో
రాహుల్ సిప్లిగంజ్ వెక్కి వెక్కి ఏడ్చిన విషయం కూడా తెలిసిందే.
ఇంటర్వ్యూలో పునర్నవి వితిక, వరుణ్, రాహుల్, నేను మంచి మిత్రులమని చెప్పింది. తను
రాహుల్ సిప్లిగంజ్ మంచి మిత్రులం మాత్రమేనని అంతకుమించి మా ఇద్దరి మధ్య ఏమీ లేదని స్పష్టత ఇచ్చింది. బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చిన తరువాత
రాహుల్ సిప్లిగంజ్ ప్రపోజ్ చేస్తే ఏం చెబుతారనే ప్రశ్నకు
రాహుల్ ఎందుకురా? ఇప్పుడిది అని చెప్పి
రాహుల్ ను గట్టిగా తిడతానని పునర్నవి చెప్పింది.
ఈ వారం ఎలిమినేషన్ కు నామినేట్ అయిన బిగ్ బాస్ ఇంటి సభ్యుల్లో
వరుణ్ సందేశ్ సేఫ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని
వరుణ్ తరువాత
రాహుల్ సిప్లిగంజ్ సేఫ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని మహేశ్ విట్టా ఎలిమినేట్ అవుతాడని వార్తలు వినిపిస్తున్నాయి. గత వారం మహేశ్ విట్టా ఎలిమినేట్ అయినట్లు వార్తలు వినిపించినా చివరకు పునర్నవి ఎలిమినేట్ అయింది.