అప్పట్లో ఎందరో అగ్రహీరోల సరసన మెరిసింది  అలనాటి అగ్రతార జయప్రద. అందాలతారగా ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకుంది  జయప్రద. పెద్ద పెద్ద డైరెక్టర్ లు సైతం జయప్రద డేట్స్ కోసం వెయిట్ చేసేంత క్రేజ్ ని సంపాదించింది జయప్రద. ఆ తర్వాత సడన్గా సినిమాలకు దూరం అయిపోయింది. ఆ తర్వాత రాజకీయాల్లో చేరి అక్కడ విజయం సాధించలేకపోయింది జయప్రద

 

 

 

 

కాగా  సీనియర్ జర్నలిస్టు బీకే ఈశ్వర్ జయప్రద గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జయప్రద  కెరీర్ తొలినాళ్ల నుండి జయప్రదతో తనకు  మంచి పరిచయం ఉందని బి కే ఈశ్వర్ తెలిపారు. అందాల కథానాయికగా  అగ్ర హీరోల సరసన నటించి  జయప్రద ... తన కెరియర్ లో వేగంగా   ఎదిగారని అని తెలిపారు. సత్యజిత్రే వంటి పేరొందిన పెద్ద దర్శకుడు... జయప్రద తో సినిమా చేయడానికి వెయిట్ చేసేంత స్థాయికి ఆమె కథానాయికగా ఎదిగారని  ఆయన తెలిపారు .ఇక  అంతటి స్టార్డం సాధించిన జయప్రద కొన్ని తప్పుడు నిర్ణయాల వల్ల ఇబ్బందులకు గురి అయిందని సీనియర్ జర్నలిస్ట్ బికే ఈశ్వర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

 

 

 

 

 స్టార్ హీరోయిన్ గా వెలుగుతున్న జయప్రద... సడన్ గా  ముగ్గురు పిల్లలు ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకోవడంతో జయప్రద  లైఫ్ మొత్తం మారిపోయిందని  అన్నారు. ఆమె వివాహం కారణంగా ఎన్నో అవమానాలను జయప్రద ఎదుర్కొన్నారని ఆయన తెలిపారు. అయితే ఆ తర్వాత తన సోదరులను ఇండస్ట్రీలో హీరోగా నిలబెట్టాలని తన సొంత డబ్బు ఖర్చు పెట్టి మరి జయప్రద  ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ... సినిమాలు ఆడక జయప్రద చాలా నష్టాల పాలయిందని  ఆయన తెలిపారు. ఇక రాజకీయాల్లోకి ప్రవేశించిన జయప్రద అక్కడ కూడా వివిధ పార్టీలు మారుతూ చెప్పుకోదగ్గ రాజకీయ నేతగా పేరు సంపాదించ లేకపోయిందని బి కే ఈశ్వర్ అన్నారు. ఇలాంటి కొన్ని నిర్ణయాల వల్ల జయప్రద తన జీవితంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆయన అన్నారు. ఇక బాలీవుడ్ లో జయప్రద బయోపిక్ ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమాలో  జయప్రద  పాత్రలో కంగనా రనౌత్ నటిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: